👌మాతృభాష మధురము!
తల్లిపాలు వంటిది!
బలవర్ధక మైనది!
ఓ తెలుగు బాల! (1)
👌మంగళకర మైనది!
సుమనోహర మైనది!
మనదీ తెలుగుభాష!
ఓ తెలుగుబాల!(2)
( తెలుగుబాల పదాలు., శంకరప్రియ.)
👌తెలుగుభాష.. మధురమైనది! సుందరమైనది! మనమంతా.. త్రిలింగ దేశీయులము! అనగా శ్రీశైలం, దక్షారామం, కాళేశ్వరం.. యనెడు, సుప్రసిద్ధ శైవక్షేత్రముల మధ్య నివసించు చున్నవారము! మనము మాట్లాడుకొనునదీ.. "తెలుగుభాష"! ఇది సర్వ శ్రేష్టమైనది! సర్వ మంగళకర మైనది!
👌సాంకేతిక పరంగా, జీవనోపాధి కొరకు.. "ఆంగ్ల భాష" నేర్చుకోవాలి! అదే విధంగా మాతృభాష యైన "ఆంధ్రభాష"ను, చిన్నారులకు నేర్పుతూ; భాషాభిమానమును పెంపొందించు కోవాలి! అందుకే, "స్వభాష.. తల్లిపాలు వంటిది! పరభాష.. డబ్బాపాలు వంటిది!" అని, అభివర్ణించారు; పానుగంటి వారు!
🚩ఉత్పల మాల🚩
కానవ మానవా! నిజము? కన్నులు, చిత్తము గ్రుడ్డివైనవా?
మానుగ మంచి చెడ్డలను మవ్వపు బాల్యము నుండి, శ్రద్ధనే
బూనుచు బోధ సేయునది, భూమిని నెప్పుడు తల్లి బాసయే!
మానవజాతి కంతటికి "మంగళ మూలము మాతృ భాషయే!"
( రచన: శ్రీ జంధ్యాల జయకృష్ణ బాపూజీ.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి