శకునం! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాతకి మహాఅనుమానం!తెల్లారుతూనే తన కంట ఎవరూ పడరాదు.ఎక్కడికెళ్లాలన్నా తిధి వార నక్షత్రం  దొరికిన పేపర్లు ముందేసుకుని తన రాశి వారికి బాగుంది అని ఉంటేనే పని చేస్తాడు. శివా అరుస్తాడు"ఏంటి నాన్నా! ఒక్కోరు ఒక్కొక్క రకంగా రాస్తారు. ఒక పుస్తకం లో  ఈరాశికి బాగా లేదు  అని ఉంటే వేరే ఆదివారం అనుబంధంలో బ్రహ్మాండంగా ఉంది అని  ఉంటుంది. దైవం మీద భారం వేయాలి ""శివా!నీదంతా ఎడ్డెమంటే తెడ్డం అనే బాపతు.పొద్దుట నల్లపిల్లి నాగది గడపదగ్గర కూచుంది.మీఅమ్మ పోయిన రోజుకూడా ఇలా నాగదిముందు తిష్ఠవేసింది." శివా విసుక్కున్నాడు "నాన్నా!ఆరున్నరకల్లా షాపు తెరవకపోతే జనాలు తిరిగిపోతారు.మన కాలనీలో నేనే ఫస్ట్ తెరుస్తానని చక్కెర  చాయ్ ఉప్పు కోసం పరుగెత్తి వస్తారు.వేరే షాపు వారు9 దాటినా తెరవరు.పిల్లలు బడికి వెళ్లాలి.పెన్సిల్ కనపడదు.అంకుల్!పెన్సిల్  అంటూ 10రూపాయలిచ్చి దౌడుతీస్తారు."ఇంతలో మనవడు రోహిత్ అందుకున్నాడు"నాన్నా!నిన్న తాత  నన్ను లేటుగా బడికి తీసుకుని వెళ్లాడు.బైట గేటు మూశారు. ప్రేయర్ ఐనాక తెరిచి క్లాస్ ముందు ఆపీరియడ్ అంతా టీచర్ నిలబెట్టింది. కాళ్ళు భలే నెప్పులు పుట్టాయి." శివా చిరాగ్గా అన్నాడు "బడి ఆఫీసు కి వెళ్లేవారు మీనమేషాలు అభిజిత్ లగ్నం అని  కూచుంటే ఎలా కుదురుతుంది? దేవుని పై భారంవేసి పోవాలి.తెల్లారకుండానే సఫాయి వారు  చీపురు కట్టలతో రోడ్ పై కన్పడతారు. మనమనసు మురికి గా ఉండరాదు.సకారాత్మక ఆలోచనలతో పాజిటివ్ గా  మంచే జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని బైట కాలుపెడ్తూనే"అమ్మో!నాకేమన్నా జరుగుతుందేమో?"అని ఆలోచన తో పరధ్యానంగా ఉంటే నిజంగానే జరుగుతుంది. రోహిత్!ఈరోజు నించి  మీఅమ్మ  దింపుతుంది.త్వరగా తయారవ్వాలి.వీలైతే  నేను  షాపు  బంద్ చేసి వచ్చి  నిన్ను బడిలో దింపుతా సరేనా!" అలాగే  అంటూ రోహిత్  సంతోషంగా  స్నానానికి వెళ్లాడు🌹
కామెంట్‌లు