బాలలహక్కులు* (గేయం);-కిలపర్తి దాలినాయుడు
ఆటలు మాహక్కు
పాటలు మాహక్కు
ఆపడానికి మీరెవరు?
చట్టం మా దిక్కు!

చదువులు మాహక్కు
పదవులు మా హక్కు
అడ్డడానికి మీరెవరు?
చట్టం మా దిక్కు!

జీవించుట మాహక్కు
భాగస్వామ్యం మాహక్కు
అటకాయించారంటే
చట్టం మా దిక్కు !

అభివృద్ధే మా హక్కు
రక్షణ పొందుట మా హక్కు
ఆదరణే లేకుంటే
చట్టం  మా దిక్కు!
-----------------------------------------------


కామెంట్‌లు