: లవ్ లెటర్;-dr కందేపి రాణీ ప్రసాద్
ఆమె నుదుటన పెట్టిన కుంకుమ
రవి బింబం వలె వెలుగు చున్నది
ఆమె కన్నులు మీనముల వలె
అల్ల ల్లాడుచు కదులుతున్న వి
ఆమె నాసిక సంపెంగ పువ్వు లా
ఆమె పెదవులు దొండ పండ్ల లా
ఆమె ముఖం చంద్ర బింబం వలె
వెన్నెలలు కురిపించి చున్నధి.

రాస్తున్న తెలుగు మాస్టారి 
కలం లో సిరా అయిపోయింది.
"ఏమిటీ ప్రేయసి పాత కాల వర్ణన '
కొత్తగా ఆలోచించాలి అనుకున్నాడు.

తన మొహం పై ఫుల్ స్టాప్ లాంటి
చుక్క కనీ కనిపించకుండా ఉన్నది
తన కన్నులు కంప్యూటర్ కర్సర్ లా
ఆత్రం గా వెతుకుతూ ఉంటాయి
తన ముక్కులాప్టాప్ మౌస్ లా
తన లిప్స్ డౌన్ లోడ్ ఐన ఆప్స్ లా
తన ఫేసు గుండ్రని సీ డి వలె
తళ తళ లాడుతు కనిపిస్తుంది.

ఆబ్బ, ఎంత బాగా రాశాను? మురుస్తూ
వంద సార్లు చదువుకున్నాడు
రేపు పోస్ట్ చేయడమే ఆలస్యం
ప్రైజ్ మనీ నాకే అనుకుని
పగటి కలలు కంటు నిద్ర పోయాడు.

కామెంట్‌లు