మరే పల్లి KGBV పాఠశాలకు 15 వేలతో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత;-వెంకట్ , మొలక ప్రతినిధి; వికారాబాద్ జిల్లా


 వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలో మరేపల్లి కేజీబీవీ  స్కూల్ లో విద్యార్థులసౌకర్యార్థం దాతల సహకారంతో 15 వేల స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసినారు.మారేపల్లి కేజీబీవీ పాఠశాలలో  స్పోర్ట్స్ మెటీరియల్ లేక ఇబ్బంది విద్యార్థులు పడుతున్న విషయాన్ని  pet.SO సోషల్ వర్కర్ వెంకట్ దృష్టికి తీసుకురావడంతో ఈ విషయాన్ని తాండూర్ లో ఉన్నదాతల ను సంప్రదించారు. వారి సహకారంతో సెయింట్ మేరీ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ జసంత బాస్కో 10  వేలు. తాండూర్ టౌన్ కు చెందిన శంకరమ్మ  5000  సహాయం చేశారు 15000 రూపాయలతోస్పోర్ట్స్ మెటీరియల్ ఈరోజు పాఠశాలకు విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రి క విజయలక్ష్మి . సెయింట్ మేరీ స్కూల్ కరస్పాండెంట్ జసంత బస్కో. సోషల్ వర్కర్ వెంకట్ పాల్గొని మాట్లాడుతూ👉   ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు అన్ని విధాలుగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు నేర్పిన బాటలో నడవాలని విద్యార్థులు చిన్నచిన్న ఆశలతో నెరవేర్చుకుంటూ భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను అధిరోహించాలని పట్టు వదలకుండా అమ్మాయిలు చదవడం వల్ల అవనికి వెలుగని అమ్మానాన్నల కోరికను నెరవేర్చాలని దానికి సమాజం పూర్తిగా సహకరిస్తుందన్నారు 👉 ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వెంకట్ ఈ సంవత్సరం SCC  స్కూల్ లో టాపర్గా నిలిచిన ఐశ్వర్య కు నగదు 1001/-రూపాయలు ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో  దాతలను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీ స్కూల్ కరెస్పాండెంట్ జసంత భాస్కో . సోషల్ వర్కర్ వెంకట్. కేజీబీవీ ప్రత్యేక అధికారి  రాజేశ్వరి. ఉపాధ్యాయులు పద్మావతి.అనిత.ప్రశాంత.అరుంధతి. ఫర్విన్.ఉమరాని.గోపిక. పల్లవి శ్రీవాణి విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు