అవగాహనే ముద్దు(మణిపూసలు);-పి. చైతన్య భారతి Zphs కవాడిపల్లి అబ్దుల్లాపూర్మెట్7013264464
మానవజన్మ ఉన్నతం 
మేధస్సు అత్యున్నతం 
జీవరాశుల్లోకెల్ల
సమస్యలతో సతమతం 

సవాళ్లకు భయపడెను 
దుఃఖంలో మునిగేను 
ఆత్మహత్య చేసుకొనుచు 
తనువులు చాలించేను. 

వ్యక్తిగతపు సమస్యలు 
వృత్తిపర చిక్కుముడులు 
ఆర్థిక నష్టాలతోను 
మద్యానికి బానిసలు 

ఒంటరితనం బాధలు 
కుటుంబపు ఇబ్బందులు 
బలవన్మరణాలు తెచ్చె 
వైవాహికపు చిక్కులు 

ర్యాoకుల ఆరాటాలు 
వేలం వెర్రి చదువులు 
వ్యక్తిత్వం తీర్చిదిద్దు
నేతిబీర చదువులు 

బాధను పంచుకొనగను 
కృంగిన హృదయాలను 
సాంత్వన కలిగించు 
తోడులేక కృంగేను 

జీవితం సమస్య కాదు 
నిరాశా నిస్పృహ వలదు 
వెలుగు నీడల బతుకులో 
సానుకూలతె కలదందు.

కష్టాల సేద్యం చేయి 
మిత్రులతో కలిసిపోయి 
ఆత్మవిశ్వాసముతో 
కష్టాలకెదురీదేయి 

ఆత్మస్తైర్యముంటేను 
పరిపూర్ణతా నీదేను 
యువతీ యువకులారా!
అవగాహన నీకుంటేను.

ఓర్పు,సహనముండాలి 
నిపుణులనూ కలవాలి 
క్షణికావేశం వీడి 
శాంతగుణం విరియాలి.

ఆత్మీయులను కలుసుకో!
హృదయభారం దింపుకో!
మొక్కవోని ధైర్యంతో 
జీవితం నిర్మించుకో!

మౌనంగా రోధించకు 
కుటుంబo పోషించుటకు 
గిట్టుబాటు ధరలేదని 
జీవితాన్ని చాలించకు...


కామెంట్‌లు