*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0162)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దేవతల పలాయనము - బృహస్పతి రుద్ర దేవుడు అజేయుడు అని చెప్పడం - విష్ణువు, వీరభద్రుని సంభాషణ - దేవతలు వెళ్ళి పోవడం - యజ్ఞ ధ్వంసం - వీరభద్రుడు కైలాసం చేరడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*దేవ గుణములకు, రుద్ర గణములకు భయంకరమైన యుద్ధం మొదలైంది. కొంత సేపు పోరాడిన దేవ గణములు పలాయన మంత్రం పఠించారు. ఎవరెవరు ఎక్కడ వున్నారో తెలియని పరిస్థితి. ఇంద్రుడు, మిగిలిన లోక పాలకులు యుద్ధం లో నిలిచి రుద్ర గణములను ఎదుర్కొంటున్నారు. కానీ, ఈ యుద్దం వారు గెలవ లేరని తెలుసుకుని, గెలిచే మార్గం చెప్పమని దేవగురువు బృహస్పతిని వేడుకున్నారు.*
*దీనాతిదీనంగా తమ విజయానికి దారి చూపమని అడిగిన దేవ గణములను చూచి, శంకరుని తలచుకుని, యుద్ద కారణము తెలుసుకుని, ఇంద్రాదులతో "విష్ణుమూర్తి ఇంతకు ముందే చెప్పిన మాటలు మీ జ్ఞాన దుర్బలత్వం వలన మీరు వినలేదు. అమాయకుల లాగా మీ దేవతా గణమంతా ఈ దక్ష యజ్ఞానికి వచ్చారు. ఈశ్వరుని తెలుసుకుని ఆయనను ఆశ్రయించి మంచి పనులు చేసే వారికే ఆ పనుల ఫలము వారికి లభిస్తుంది. కానీ, శివ నింద చేసే వానికి ఎటువంటి ఫలితము దక్కదు. లౌకిక శక్తిలు వున్న వారు, పూర్వ ఉత్తర మీమాంసలు, వేదములు, పదివేల సార్లు వేదములను చదివిన స్వాధ్యాయులు కూడా పరమేశ్వర తత్వం తెలుసుకో లేరు. ఎంతో ఉత్తమ ఆలోచనలు, ఆచరణ వున్న వానికి అయినా, వృషభదేవుని అనుగ్రహం వుంటేనే, ఆ పరాత్పర తత్వం తెలుసుకో గలుగు తారు".*
*"ఇంద్రా! అతి అమాయకులై నీవు, దిక్పాలకులు, మిగిలిన దేవగణములు, శివ దూషణ జరుగుతున్న ఈ యజ్ఞానికి వచ్చారు. ఇక్కడ జరుగుతున్నది పరమేశ్వర నిందా కార్యక్రమం. ఇక ఇప్పుడు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అనంత బలశాలులు, అరివీర భయంకరులైన రుద్రగణాలను తీసుకుని వీరభద్రుడు వచ్చాడు. రుషభేశ్వరుని ప్రతిజ్ఞను వీరు తప్పక చెల్లిస్తారు. మరి, ఇంతటి వీరులతో నీవు, మిగిలిన దేవగణములు ఏ మేరకు యుద్ధంలో నిలువగలరో ఆలోచించుకోండి. ఇది మీ వల్ల అయ్యే కార్యం కాదు. ఎందుకంటే మీరు సర్వ కర్త, భర్త అయిన శివ సేనలకు ఎదురగా నిలిచే సాహసం చేస్తున్నారు.*
*బృహస్పతి మాటలు విన్న ఇంద్రాదులు ఎంతో చింతిస్తూ వున్నారు. ఇంతలో, రుద్రగణ పరివేష్టుడైన వీరభద్రుడు, ఇంద్రాదుల మీదకు వాడి బాణాలతో, శూలాలతో, పరిఘలతో దాడి చేసి వారిని తీవ్రముగా గాయపరిచాడు. ఈ భయంకరమైన దాడిని ఎదుర్కొనే శక్తి లేని ఇంద్రుడు, దిక్పాలురు, తలకో దారి చూసుకుని పారి పోయారు. లోకపాలకులు, మిగిలిన దేవతలు కూడా యుద్ధాన్ని వదలి పారిపోయారు.*
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు