*: దశావతార వర్ణనము - కూర్మావతారము :*
*ఉత్పలమాల:*
*కరమనురక్తి మందరము | గవ్వముగా నహిరాజు త్రాడుగా*
*దొరకని దేవదానవులు | దుగ్ధపయోధి మథించుచున్నచో*
*ధరణి చలింప లోకములు | తల్లడ మందఁగఁగూర్మమై ధరా*
*ధరము ధరించితీవెగద | దాశరధీ ! కరుణాపయోనిధీ !*
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా! చేతులతో ఎంతో ప్రేమగా మందర పర్వతాన్ని కవ్వముగా, సర్పరాజు అయిన వాసుకిని కవ్వపు తాడుగా చేసుకుని దేవతలు రాల్షసలు పాలసముద్రమును చిలుకుతున్నప్పుడు భూమి కంపించి, లోకములు తల్లడిల్లి పోయినప్పుడు కూర్మావతారము ఎత్తి భూమిని నీ వీపుపై మోసినది నీవే కదా, పద్మదళ నేత్రా, క్షీరసాగర శయనా!......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఎంతటి కష్టతరమైన పనిని అయినా, నలుగురి సంతోషం కొరకు, సంఘహితం కోసం చేస్తే నీ సహాయం ఎప్పుడూ వుంటుంది అని చెప్పడానికి నీవు ఎత్తిన కూర్మావతారమే నిదర్శనం. ఆ సహాయం చేసేటప్పుడు నీకు కలిగే శ్రమను లక్ష్యం చేయవుగదా, గరుడగమనా! మనం నేను, నా నుండి మనమందరం దగ్గరకు వెళ్ళాలి అని చెప్పడానికి ఇంత కంటే ఉదాహరణ కావాలా. సముద్ర మథనం నుండి విషం వచ్చినా, అమృతం వచ్చినా తనకు ఏమీ లాభం జరగదు అని తెలిసి కూడా సహాయం చేసాడు దేవదేవుడు. మనం పని మాత్రమే చేయాలి, ఫలితం మనమే పొందాలి అని ఆలోచించకుండా! నలుగురి కోసం పనిచేయాలి. ఫలితం ఆశించకుండా. ఇంతకంటే గొప్ప విషయాన్ని సమాజంలో ఇంక ఎవరు చెప్ప కలుగుతారు. ఆచరించడం మన కర్తవ్యం.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి