*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 071*
 *: దశావతార వర్ణనము - వరాహావతారము :*
*ఉత్పలమాల:*
*ధారుణి జాపఁజుట్టిన వి | ధంబున గైకొని హేమనేత్రుఁడ*
*వ్వార్నిధిలోన దాఁగినను | వాని వధించి వరాహమూర్తివై*
*ధారుణిఁదొంటికైవడి | ని దక్షిణ శృంగమనన్ ధరించి వి*
*స్తార మొనర్చి తీవెకద | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా!   
హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాప చుట్టినట్టుగా చుట్టి మహా సముద్రం లోపల దాక్కుని వున్నప్పుడు    వరాహమూర్తిగా కొలిచే పందిరూపము అవతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుని చంపి నీ కుడి పంటి కింద పట్టి ఎత్తి సముద్రము పైకి తీసుకువచ్చి మరల చాపలాగా పరచినది నీవే కదా, లక్ష్మీ పతి!......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*మానవ మాత్రులమైన మాకు కష్టాలను తొలగించడానికి నీవు పడని కష్టాలు లేవు కదా, రమానాధా!  నీ అండ ఉంటే మేము సాధించలేనిది ఏదీ లేదు కదా, కాంతాపతీ! నీ మాయలో పడి నిన్ను మేము మరచిపోతామేమో అని నిన్ను నీవే మాకు మాటిమాటికీ పరిచయం చేసుకుంటున్నావు, పరాత్పరా! నీ అనుగ్రహం లేని ఈ భూమండలం అతలాకుతలం అయిపోతుంది, దేవదేవా! మాకు నీవే దిక్కు. కరుణించి కాపాడు, తండ్రి!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు