గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (43);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 ఒకరోజు  ఇష్టాగోష్టిగా మాట్లాడుకుంటున్న సందర్భంలో నా ప్రక్క ఒక స్నేహితుడు  శివ నాగి రెడ్డి గారు ఇవాళ  దానాల పేరుతో వసూలు చేయడం విపరీతంగా పెరిగిపోయింది కదా. దాని గురించి మీ అభిప్రాయం చెబితే ఆనందిస్తాం అంటే ఒక్క క్షణం ఆలోచించి  సనాతనులు చెప్పిన విధానం ప్రకారం ఏ విషయం అయినా మూడు విభాగాలు చేయవచ్చు.  మీకు బజార్లో  ముష్టి ఎత్తుకునే  వారు మాత్రమే కనిపిస్తారు.  దీనిలో మూడు విభాగాలు  ఆకలికి నకనకలాడుతూ బాబు ధర్మం చేయండి అని 

అడిగే వారిని ఒక రకంగా పెడితే  డబ్బు సంపాదన కోసం  కొత్త కొత్త పథకాలు పెట్టి గుడి కట్టిస్తున్నాం అన్నదానాలు చేస్తున్నాం  బజారులో తల్లిదండ్రుల్ని వదిలి వున్న వారిని తీసుకువచ్చి పెంచుతున్నాం అని చెప్పే వారు నిజంగా చేస్తున్నారో లేదో మనకి తెలియదు కానీ  డబ్బులు మాత్రం వసూలు చేస్తుంటారు. మరికొంతమంది  మతం కోసం  పాటుపడుతున్నాం  సంస్కృత భాష మరణించకుండా బ్రతికించడం కోసం  ప్రయత్నం చేశాం, చేస్తున్నాం  అని మడికట్టుకు కూర్చున్న వారి దగ్గరికి వెళ్లి  లక్షల్లో విరాళాలు ఇచ్చేవారిని వెతికి వసూలు చేస్తారు. ఇలాంటిదే వ్యభిచారం కూడా వారిలో  ఆకలికి తట్టుకోలేక కుటుంబ భారాన్ని పోషించడం తన భుజాల పై వేసుకొని  తప్పక చేస్తున్న వ్యభిచారం ఒక రకం. ఇతరులతో భంగ పడి  మోసపోయి జీవితాలను నాశనం చేసుకొని పస్తువులతో జీవించే వారు  మరోరకం  విలాసాలతో విందులతో  క్లబ్బుల్లో కాలక్షేపం చేస్తూ  నేను ఫలానా వారితో తిరుగుతూ ఉంటే  సమాజంలో గౌరవం  పెరుగుతుంది అన్న భ్రమలో  మరి కొంతమంది ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉంటారు. నేను వీరిని ఎవరినీ లక్ష్య పెట్టను. ఆకలితో అలమటించే వారికి  వారి ఆకలి తీర్చడం కోసం  నాకు చేతనైన సహకారం అందిస్తాను  అటు స్త్రీలు కానీ ఇటు పురుషుడు కానీ ఎవరైనా  వారి ఆకలి తీరడం ముఖ్యం.  కనుక ఉదయం, సాయంత్రం అయితే  ఇడ్లీ గానీ, పూరి గానీ, గారె గానీ అదే మధ్యాహ్నం రాత్రి అయితే భోజనం  హోటల్లో ప్యాక్ చేసుకొని  వారికి అందిస్తే  హాయిగా తిని సుఖంగా నిద్ర పోతారు. ఆ ఒక్క రోజు అయినా ఆనందంగా గడుపుతారు స్త్రీలలో కూడా అంతే. వారిని ప్రక్క ఇంటి వారీగా  భావించి ఆమె ఆకలి తీర్చడమే నా ఉద్దేశ్యం. అలా అని ఇంత వరకూ  ఏ తప్పూ చేయలేదు. అది నా అంతరాత్మకు తెలుసు  కనుక మీకు నేను ఇచ్చే సలహా ఎవరికీ డబ్బులు ఇవ్వకండి  చేయవలసిన సహాయం  తినడానికి కట్టడానికి ఉండడానికి  చేస్తే చాలు. నేను అదే  అనుసరిస్తూ ఉన్నాను అన్న తర్వాతనైనా  మనలాంటి మరి కొంత మంది ముందుకు వచ్చి  అలా సహకరిస్తే  సమాజంలో కొందరైనా ఆనందిస్తారు. అందుకే రెడ్డి గారిని  అభినందించడం.


కామెంట్‌లు