గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (44);-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పరిణామ సిద్ధాంతం  తుది దశ  బుద్ధి దానిని కూడా భగవత్స్వరూపంగానే చెప్పారు బుద్ధ భగవానుడు. బుద్ధి మానవుల్లో ఎప్పుడు పెరిగింది  చక్కగా సేద్యం చేసి పంటలు పండించి  రకరకాల చిరుధాన్యాలతో  వ్యాపారాత్మక పంటలను కూడా అభివృద్ధి చేసి  జీవితాన్ని కొనసాగిస్తున్నాడు మానవుడు. కడుపునిండిన తర్వాత  మతాలు ప్రారంభమవుతాయి. దానివల్ల ఏమి జరుగుతుంది  ప్రపంచం మొత్తం ఒకే మతమైతే  ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తారు  అలా కాకుండా  రకరకాల మతాలతో రకరకాల వ్యక్తుల మనస్తత్వాలు  ఒకే రకంగా ఉంటాయి అన్న హామీ ఎవరైనా ఇవ్వగలరా  అలా హామీ ఇవ్వగలిగితే  ఎలాంటి దుష్పరిణామాలు రావు  కానీ అలా జరగదు కదా  అప్పుడే సమస్యలు ప్రారంభమవుతాయి  ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం లోనే  మానవ మేధస్సు పని చేయాలి. ఈ పరిస్థితి నుంచి బయట పడడానికి  నీ బుద్ధిని ఉపయోగించాలి  ఇది నీ ఒక్కడితో జరిగే పని కాదు కదా  సమాజం మొత్తం అంగీకరించాలి. దానికి బుద్ధుడు చెప్పిన ఒకే ఒక సూత్రం  నీ మనసును నీ అధీనంలో ఉంచుకో మనసు చెప్పే కోర్కెలను అంగీకరించక  నీ బుద్ధి దేని మీద కేంద్రీకరించి దేనిని తెలుసుకోవాలని అనుకున్నావో దాని మీదనే ఉంచు  దాని కోసం నాలుగు మార్గాలను ఎనిమిది పద్ధతులను ఆయన తన శిష్యులకు బోధించారు. దానిని అనుసరించిన వారు  విజయాన్ని సాధించారు  దానిని గుర్తించని వారు పెడ మార్గం పట్టారు. మనసు అనేక ఆలోచనలను రేకెత్తిస్తుంది.  ఆ మనసును  నీ చెప్పు చేతల్లో ఉంచుకుంటే  జీవితంలో అన్నీ సుఖాలే  దానిని బుద్ధి శాసిస్తుంది  కనుక అది చెప్పినట్టు విను. అప్పటికే ఎన్నో అపోహలతో వున్న ఆనందుడు, సుందరి కూడా  గౌతమ బుద్ధుని శిష్యులయ్యారు పాళీ భాషలో బుద్ధ భగవానుడు  సంస్కృతంలో ఉన్న వేదాల సారమంతా మూడు పిటకముల ద్వారా మానవ మనుగడకు మార్గదర్శకాలను  నిర్దేశించారు. వాటిని అధ్యయనం చేసి అనువదించి దానిలో ముఖ్యాంశాలను  సామాన్యులకు కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసిన వారిలో రెడ్డి గారు కూడా ప్రథములు. అందుకే వారు ఏ చీకూ చింతా లేని శాంతియుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీనికి చేయవలసినంత చేసి  ఉన్న కోర్కెలను కూకటివేళ్లతో సహా పెకలించి వేయి. కోర్కెలు లేని వారికి వైరాగ్యం రాక తప్పదు  అది ప్రజాశ్రేయస్సుకు దోహదపడుతోంది. ఆ ప్రయత్నంలో రెడ్డి గారు కృతకృత్యులయ్యారు అని చెప్పవచ్చు. అందుకే శాంతియుత జీవితాన్ని గడుపుతున్నాడు ఆనందంగా.

కామెంట్‌లు