"నవదుర్గామాతస్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.

తే.గీ.
ఆరవయవతారముగానుచేరిభువికి
తల్లి"కాత్యాయనీ"మాతతరిగిపోని
సంపదలనిచ్చిభక్తులసాకుచుండి
వైభవమ్మునుకల్గించుశోభలలర!!!

02.
తే.గీ.
ఆ"మహాభాష్య"మనుగ్రంథమందునందు
ముని"పతంజలి"పేర్కొనితనివితీర
దుర్గదేవిగావర్ణించె;తొలగజేయు
పాపములనెన్నొయాతల్లిపాలవెల్లి!!!

03.

తే.గీ.

పార్వతీమాతయేతానుపావనముగ
నణచివేయునుచెడులక్షణాలనెన్నొ
భద్రముగభవబంధపుపడవనింక
ఒడ్డునకుజేర్చుకమలాక్షియోదయాళు!!!


కామెంట్‌లు