కలసి ఉంటే కలదు సుఖం ఇది అందరికీ వర్తిస్తుంది గడ్డిపరక నుంచి ప్రతి జీవికి కలిసిమెలిసి ఉండడం ఒకరికొకరు సహకరించుకుంటూ సహాయం చేసుకోవడం లేకపోతే అది పరిపూర్ణమైన జీవితం కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ బీజం వేయకపోతే ఈ సమాజం చీలిపోయి నీకు నీవు నాకు నేను అన్నట్లుగా తయారవుతోంది. ఎవరి పని వారిదే అయినప్పుడు చేదోడువాదోడుగా వుండే అవకాశమే ఉండదు చిన్నతనంలో మనం ఆటలాడుతూ ఉంటాము. శరీరశ్రమ శరీరం మొత్తం చెమటతో తడిసి పోతే అప్పుడు హాయిగా స్నానం చేసి ప్రశాంతంగా ఉండవచ్చును ఎలాంటి జబ్బులు రాకుండా ఉండడం కోసం అని మన పెద్దవాళ్ళు చిన్నప్పుడే మనకు నేర్పుతారు. చెడుగుడు ఉంది ఎవరి ప్రయత్నాలు వారు ఇస్తారు. ఎవరు బలవంతుడు అయితే వారే గెలుస్తారు.
అదే కబాడీ అయితే జట్టు లాగా ఉంటుంది. అందరూ కలిసికట్టుగా ఉంటే తప్ప విజయాన్ని సాధించలేరు. అవతల వ్యక్తి వచ్చి ఒకరిని అంటుకుంటే వారిలో ఒకరు చనిపోతాడు. వారిని రక్షించుకోవడం కోసం అందరూ ఏకమై అతనిని చంపుతారు. అది జీవితానికి కూడా సమన్వయ పరచుకుంటే సమాజం అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుతుంది. ఈ ఆటలో కొంతమంది ఒకరంటే ఒకరికి పడని విరోధులు ఉండడం సహజం. అక్కడ వ్యక్తిగత సంబంధాలు పనిచేయవు ఆటలో విజయాన్ని సాధించడమే వారి లక్ష్యం తప్ప వేరే ఆలోచనలు వారి మనసుకు రావు. అందుకే మన పెద్దవాళ్ళు ఆటలు ఆడేటప్పుడు స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి తప్పనిసరిగా అంటారు గెలవడం ఓడిపోవడం సహజం కానీ వ్యక్తిగత సంబంధాలు చెడకూడదు. అదే మా పిల్లల విషయానికి వస్తే చెర్రీ సిరి ఇంట్లో ఒకరితో ఒకరు పేచి పడుతుంటారు. చేతులు చేతులు కలుస్తాయి కూడా అదే ఆటలలోకి వెళితే అన్ని ఆటల్లోనూ వీరిద్దరే మొదటి రెండు స్థానాల్లో నిలుస్తారు. పిల్లలన్న తర్వాత చిన్ని చిన్ని జగడాలు తగాదాలు రావడం మనకు తెలుసు. అలా జరిగినప్పుడు సిరిని ఎవరైనా ఏ మాట అన్న చేయి చేసుకోవడానికి ప్రయత్నించినా చెర్రీ పరిగెత్తుకెళ్లి ఆమెకు అండగా నిలబడుతాడు ఏం జరిగిందొనని విచారిస్తాడు అవతల వాడు తప్పు చేసి జబర్దస్తీగా మాట్లాడితే తను చేయి చేసుకోవడానికి సిద్ధం. లేదూ పొరపాటుగా తన చెల్లి తప్పు చేసి ఉంటే చిన్న పిల్ల కదా తప్పు చేసింది ఇకముందు చేయదులే చేయకుండా నేను చూసుకుంటాను కదా అని భరోసా ఇచ్చి ఆ తగాదాను అంతటితో అపు చేస్తాడు. పిల్లలు ఆ వయసులో అలా ప్రవర్తించినప్పుడు పెద్దవారికి ఎంత ముచ్చటగా ఉంటుంది చూడడానికి. ఆ స్థితి రావాలని నేను కోరుకుంటున్నాను దానికోసమే ప్రతి అమ్మకు నేను చెప్పేది మీరు అది విని అర్థం చేసుకుని నేను చెప్పిన పద్ధతిలో వాళ్ళను తీర్చిదిద్దాలని ఆశించే మీ చిన్న డాక్టర్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి