అమ్మ భద్రత;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తల్లులకు ఇంతకు పూర్వం ఒకసారి మనవి చేశాను పిల్లలు బడి నుంచి రాగానే  తమ వస్తువులను ఎక్కడ  ఉంచాలో అక్కడ ఉంచి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో  బయట నుంచి వచ్చే వారు అలాగే బూట్లతో, చెప్పులతో లోపలికి రాకూడదు  కాళ్ళు కడుక్కుని  ఎలాంటి క్రిమి కీటకాలకు  చోటు ఇవ్వకుండా ప్రవర్తించాలి అని  అమ్మలు పిల్లలకు చెప్పాలి. వారు  చేస్తున్నారు బాగానే ఉందని చెప్పి వదిలేయడం కాదు  వారు అక్కడ ఏం చేస్తున్నారో చూడటం లేదు కదా కాళ్లు కడగడానికి  కారణం బయట నుంచి నడిచి వచ్చేటప్పుడు  అనేక రోగ కారక క్రిములు వారి కాళ్లను అంటిపెట్టుకొని ఉంటాయి. వాటి బారి నుంచి బిడ్డను తప్పించడం కోసం  కానీ బిడ్డ ఏం చేస్తున్నాడు ఒక చెంబుడు నీరు తీసుకొని  పాదాల పై పోస్తున్నాడు.  నేను కాళ్ళు కడిగేశానని మీరు చెబుతున్నాడు. ఆ మాట నమ్మి  మీరు ఊరుకుంటున్నారు  కానీ ఒకరోజు చూడండి  కాళ్లు తడపడం వేరు  కాళ్లు కడగడం  వేరు  ముందు తడిపి చేతితో రుద్ది సున్నిపిండితో కానీ,  సబ్బుతో కానీ శుభ్రం చేసి  అప్పుడు వస్తే నేను చెప్పినది ఫలప్రదం అవుతుంది లేకపోతే అడవి కాచిన వెన్నెల దాని వల్ల ఉపయోగం ఏముంది.  మొదటి నుంచి పిల్లలను మనం ఎలా పెంచాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి  మన పెద్దలు చెప్తూ ఉంటారు  నీటిని ఎక్కువగా వాడేవారు  ధనాన్ని కూడా విచ్చలవిడిగా  వాడుతూ ఉంటారు అని  అలా అని బజారులో పారవేస్తారన్నది కాదు. ఇంటికి లేదా తనకు అవసరం ఉందా లేదా  ఆ అవసరం ఎంత వరకు  ఉన్నదో అంతవరకే ఖర్చు చేయాలి తప్ప వృధా చేయకూడదు  అన్నది చిన్నతనంలోనే అతనికి అర్థమయ్యేలా చెప్పాలి.
స్నానం చేసేటప్పుడు పాలు తాగేటప్పుడు  బయట నుంచి రాగానే నీళ్లతో మొహాన్ని సబ్బుతో రుద్ది కొనేటప్పుడు  నీటిని ఎలా పొదుపుగా వాడాలో వారికి అర్థమయ్యేలా చెప్పాలి ఇటు రెండు చెంబులు  పోసుకుని ఒక చెంబు తలమీద పోసుకుంటే అది స్నానం చేసినట్లయితే అవుతుందా  బకెట్ లో ఎన్ని నీళ్లు ఉంటే అన్ని నీళ్లు పోస్తారు తప్ప  శరీరంలో ఏ భాగాన్ని ఎంతవరకు చేయాలో అతనికి తెలిసేలా తల్లి చెప్పాలి  లేకపోయినట్లయితే మీరు ఎంత నీరు అక్కడ పెడితే ఆ మొత్తం ఖాళీ అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు  మన పెద్దలు సంప్రదాయమని ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు దానికి కారణం ఏమిటి  కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలి అన్న పరమార్థం  వారికి తెలుసు  మనము నిద్రలేచిన నుంచి నిద్రపోయే వరకు ప్రతి క్షణం పిల్లల్ని గమనిస్తూ ఉన్నట్లయితే వారి జీవితం  మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది  అని అనడంలో ఏ మాత్రం సందేహం తెలియదు.  మరి పరిశీలన మీద మనసు పెడతారు కదా అమ్మలు.



కామెంట్‌లు