సంప్రదాయం తెలియాలి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇతర దేశాల నుంచి వచ్చిన అనేకమంది  మన దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థను చూసి ఎంతో ముచ్చట పడ్డారు. ఇంతకాలం ఒకే కుటుంబంగా ఎలా ఉండగలిగారు అని ఆశ్చర్యపోతారు కూడా. నిజానికి ఆ వ్యవస్థ  కొంతకాలంగా కొంచెం బీటలు వాడినట్టుగా అనిపిస్తోంది. వివాహం రెండు రకాలుగా జరుగుతుంది. పెద్దలకు ఆ పిల్ల నచ్చి ఆ కుటుంబం లో ఉన్న  సంప్రదాయాన్ని  చూసి  వివాహానికి అంగీకరించడం, దీనిని పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ చెప్తారు.  ఒక యువతి మరో యువకుడు ఒకరినొకరు చూసుకుంటూ ఒకరికి ఒకరు ఇష్టపడి ఆనందంతో వివాహం చేసుకోవడం, వీలైతే పెద్దవారు అంగీకరిస్తారా లేదా అన్న ఆలోచన కూడా ఉండదు అంగీకరిస్తే సరే లేకపోతే వారిని వ్యతిరేకించయినా చేసుకోవడానికి సిద్ధపడింది ఈనాటి యువత. దానితో కులాంతర మతాంతర వివాహ  ప్రవాహం  ప్రారంభం అయ్యింది. కొంతకాలం అయిన తరువాత అసలు రంగు బయటపడుతుంది  నిజంగా  మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఇష్టపడినప్పుడు ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా  సంసారం సుఖంగా సాగుతుంది. ఒకరికి మరొకరు నచ్చనప్పుడు విభేదాలు వస్తాయి  అప్పుడు ప్రారంభమవుతుంది  అసలు తగాయిదా. అప్పటికే ఒక ఆడపిల్ల ఉంటుంది ఆ పాపను ఏం చేయాలి ఎవరి దగ్గర ఉంచాలి  ఆమె పోషణ భారం ఎవరు వహించాలి ఈ సమస్యలన్నీ ప్రారంభమవుతాయి. ఇది తెగే వ్యవహారం కాదు  తల్లిదండ్రులను సంప్రదిస్తే  మాకు చెప్పి చేసుకున్నారా మీ పెళ్లి  మాకు ఏమిటి సంబంధం  మీరే గంగలోనైనా దూకండి మాకు ఇబ్బంది లేదు అని నిర్మొహమాటంగా చెప్తారు  చేసేది లేక చివరికి  న్యాయస్థానం మెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
న్యాయాధికారి విషయమంతా విని  ఏం చేయాలో తనకు పాలుపోక  ఆ పాపను అడుగుతాడు  పాపా నీకు ఎవరంటే ఇష్టం నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా  వీరు విడాకులు తీసుకుంటున్నారు అంటే విడిపోతున్నారు  ఎవరికి వారు జీవిస్తుంటారు నీవు ఎవరి దగ్గర ఉంటావు  ఎవరి అంటే నీకు ఇష్టం అంటే ఎంతో గారాంగా నాకు ఇద్దరూ ఇష్టమే అమ్మా కావాలి, నాన్నా కావాలి ఇద్దరి దగ్గర ఉంటాను  అని చెప్పినప్పుడు మనసున్న ఏ మనిషి అయినా కన్నీరు పెట్టుకోకుండా ఉంటాడా?  అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండగలవా అని ప్రశ్నిస్తే దానికి ఆ పాప  నాకు ఇద్దరి మధ్య పండుకుని ఇద్దరు జోలపాడుతూ ఉంటే నిద్రపోయే అలవాటు. నేను ఇద్దరి దగ్గర ఉంటా అంటే  ఆ న్యాయాధిపతి ఏం చేయగలరు. పాపను సంతృప్తి పరచాలా? భార్యాభర్తలను వేరు చేయాలా? ఎటూ తేల్చుకోలేని  పరిస్థితిలో చిక్కుకుంటాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి విపత్కర పరిస్థితులలో చిక్కుకోవలసి వస్తుంది. కనుక ఏ పని చేసినా సంప్రదించి విషయం పూర్తిగా అవగాహన చేసుకుని అప్పుడు చేయమని నా సలహా సరేనా. భార్యాభర్తలుగా విడిపోయే అధికారం మీకుంది పిల్లకు తల్లిగా తండ్రిగా విడిపోయే అధికారం లేదు అని జడ్జీ గారి తీర్పు. ఆ పాప ఎంతో ఆనందించింది.


కామెంట్‌లు