మనిషి ఆలోచనలకు బీజాలు పడేది పసి వయసులోనే. పెద్దలతో పోలిస్తే పిల్లలలో అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్ని అయినా వాళ్ళు ఇట్టే గ్రహించగలరు. మీరు చిన్నపిల్లలను గమనించి ఉంటే వాళ్లు మనం చేసే పనులను అలవాట్లను చూస్తూ వాటిని అనుకరిస్తూ ఉంటారు. అనుకరిస్తే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వారు మంచి విషయాలను గ్రహిస్తే పర్వాలేదు, అదే చెడు ప్రభావానికి లోనైతే. అందుకే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కలర్స్ అనేవి పిల్లలను అట్రాక్ట్ చేయగలవు, కదిలే బొమ్మలు... అంటే వీడియోస్, గేమ్స్, కార్టూన్స్ లాంటివి పిల్లల సైకాలజీని బట్టే రూపొందించారు. ఈ గ్యాడ్జెట్స్ ప్రభావాలకు పిల్లలు లోనవ్వడం సహజం. అయితే ఇక్కడే మనం జాగ్రత్త వహించాలి. కార్టూన్స్ లో చాలా వరకు సూపర్ పవర్స్ ను ఉపయోగించి సూపర్ హీరో చాలా చాలా అడ్వెంచర్స్ చేస్తున్నట్టు, అసాధ్యమైన వాటిని
కూడా చాలా సింపుల్గా చేసేస్తున్నట్టు, బైక్స్ నడుపుతున్నట్టు, బిల్డింగ్స్ ఎక్కుతున్నట్టు చిత్రీకరిస్తారు. అలాంటివి చూడడం వల్ల పిల్లలలో తాను ఒక సూపర్ హీరో అన్న భావన కలిగి ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలను సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉంచాలి. వారికి అవగాహన మెరుగుపడేంతవరకు ఇటువంటి చెడు ప్రభావాలకు లోను కాకుండా తల్లి బాధ్యత వహించాలి. ఆటలకు వాళ్లను మళ్లించి వారిలో ఫిజికల్ ఆక్టివిటీ పెరిగేలా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అచ్చమైన తెలుగు కథలను చెప్తూ, తెలుగు పదాల అర్థాలను, నీతి కథల అంతరార్థాలను, ప్రకృతి అందాలను వారికి వివరిస్తూ వారితో కాలక్షేపం చేయాలి. అప్పుడే వారిలో సృజనాత్మకత మెరుగుపడుతుంది. మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని
ఉన్నతమైన ఆలోచనలు చేయగలుగుతారు.
అంతేగాని పిల్లలను సముదాయించలేక టీవీ రిమోట్లను వారి చేతులకు అందించి తీరా వారు అలవాటు పడ్డాక వారిని కొట్టో తిట్టో సరిదిద్దాలనుకుంటే దానికన్నా మూర్ఖత్వం మరొకటి ఉండబోదు. కాబట్టి పిల్లల అలవాట్లు పెద్దల ప్రవర్తనని బట్టే వుంటాయి. ఒరే పిల్లలు ఈ రోజు నుంచి అమ్మని మంచి మంచి కథలు వినిపించమని అడగండి.... సరేనా.... ఓకే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి