నేల రాలుతున్న పసి మొగ్గలు;- - నెల్లుట్ల సునీత - ఖమ్మం- ఫోన్ : 7989460657
 మస్తిష్కపు పొరల్లో 
ఒక ఉన్మాదపు కణం 
మానవత్వంపై నీళ్లు చల్లుతోంది 
పసి గుడ్డు నీడనైనా వదలని 
పైశాచికత్వం 
యథేచ్ఛగా తొక్కుతు వెళుతోంది 
అత్యాచార పర్వాలతో 
పృథ్వి తల్లడిల్లిపోతోంది 
కన్న పేగు బంధాలకే తలమానికమై 
మనిషితనానికే మచ్చౌతోంది 
ఈ క్రూరత్వపు క్రీనీడలో 
జాలి దయా ఓటమి పాలై 
సృష్టినే స్తంభింపజేస్తోంది 
ఈ విపరీతపు ఆగడాలన్నీ 
అధఃపాతాళానికి తొక్కిననాడు 
భువిపై పసి కందుల స్వేచ్ఛకు 
మనిషి జన్మ హర్షిస్తుంది 
మోహంతో మూసుకుపోయిన కళ్ళు 
తెరుచుకున్న రోజే 
ధరణి ప్రణమిల్లుతుంది 

కామెంట్‌లు