గజల్;-చంద్రకళ యలమర్తి-8008915828-విజయవాడ
6666 తిశ్రగతి 
రదీఫ్.     : హాయిగాను
తఖల్లూస్ : చందమామ

****

జీవితమే   వరముకదా
పంచిపోవె    హాయిగాను
కలతలన్ని     వెతలనన్ని
మరచిపోవె   హాయిగాను  

దూరమైన     భారమైన
మారిపోదు    మాసిపోదు
అందమైన     అనుబంధం
నిలిపిపోవె     హాయిగాను

ఆత్మీయపు    పలకరింపు
అనుబంధపు  సుగంధమై
అల్లుకున్న        ప్రేమలన్ని
చెప్పిపోవె     హాయిగాను

మూడునాళ్ళ  జీవితమే
మరునిముషమె   ముగిసిపోవు
మమతలతో  ముడివేసుకొ
   గడిపిపోవె  హాయిగాను

హెచ్చు తగ్గు   అడ్డుగోడ
ఇంకెందుకె     చందమామ
తరతరాల      అంతరాలు
తెంపిపోవె      హాయిగాను


***


కామెంట్‌లు