దేవీ వీణాపాణి!;-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్యపర్యవేక్షకులు,8555010108
 జ్ఞాన జ్ఞాపక సకల కళల అధి దేవత శ్రీవాణి
జీవుల నాలుకపై నర్తించే బుద్ది ప్రదాయిని! 

యుక్తాయుక్త విచక్షణ వివేచనశక్తి నిచ్చు తల్లి 
పలుకుల తల్లిగా అవతరించిన బ్రహ్మదేవేరి! 

హంస వాహనంపై ధవళ వర్ణ వస్త్రాలంకరణగా
అక్షరమాల అభయ ముద్రల పుస్తకధారిణి!

చందన చర్చిత దేహంతో దర్శనమిచ్చు భారతి 
కల్పనా నైపుణ్య కవితాస్ఫూర్తి నిచ్చు వీణాపాణి!

సత్య స్వరూపిణి శారదా సరస్వతీ మాతా
శుంభని శుంభులనే రాక్షసుల వధించిన దేవీ!                 

నమ్మిన వారినెపుడు పతనం కానివ్వని బ్రహ్మీ 
వాల్మీకీ వేదవ్యాస మహర్షుల వాగ్వైభవం నీవే! 

ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి
సకల విద్యల సమిష్టి మూర్తి వాగ్దేవి!

నాన కవి కవితారస రమ్య కలం పదును నీవే
పాహిమాం!రక్షమాం! భాషా జ్యోతిర్మయి దేవీ!
    (శ్రీ దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలలో ఏడో రోజు శ్రీ సరస్వతీ దేవి దర్శనం  సందర్భంగా)
      


కామెంట్‌లు