నీ అణువంత చేయూత...
బలమైన రక్షణ బంధమై
దైర్యంగా దారిచూపే దైవమార్గమై
జీవనశైలి మెరుగు పరుస్తుంది
కమనీయమైన ఫలమై
నీకు అనంత ఆనందాన్నిస్తుంది !
నీవు చేసే చిరు సహకారం...
ఒకానొక ఆపత్కాల క్షణం
అసాధ్యం సుసాధ్యమై
మనిషిని మార్గదర్శిగా
మహిమాన్విత మూర్తిని చేస్తుంది !
నీవు యిచ్చే ఓ అద్భుతాలోచన...
ఒక అపారమైన నమ్మకమై
కార్యసాధకునిగా మారుస్తూ
విజయశిఖరాగ్రం చేరుస్తూ
మధురానుభూతి పంచుతుంది !
నీవు అందించే ఓ ఆత్మ విశ్వాసం...
విషం చుక్కసైతం అమృతమై
నిరాకార స్వప్నం సాకారమై
అనంతాకాశం అంచు చుట్టేస్తుంది !
కోట్లున్నా ఈ విశాల విశ్వంలో ...
నీ అస్థిత్వం కొన్నాళ్ల ముచ్చటే!
నిద్రాణమైన చీకటి బతుకుల్లో
చిరు దివ్వెల కాంతి నింపి
చిరస్థాయిగా మధుర జ్ఞాపకంగా నిలిచిపో !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి