అంతర సంస్కారం ఉద్దీపనం;--- కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,8555010108.
దీపం పరబ్రహ్మ స్వరూపం
శివుని తేజోమయ  ప్రతిరూపం
అజ్ఞాన తిమిరం తరిమే జ్ఞానోదయం
దైవశక్తి కాంతి సోకిన మనస్సు వికాసం

ఎక్కడ దీపం వెలుగులు విరజిమ్మునో
దీప శిఖాగ్ని చుట్టూ విస్తరించే శక్తి క్షేత్రం 
అమోఘశక్తి వ్యాపనం ఆ ప్రాంగణం
అఖండ శక్తియుత దివ్య శోభాయమానం

అగ్ని వెలుగుకి జీవితానికీ మూలం
అగ్నితో సకల జీవుల సహజీవన యానం
వెలిగే దీపాన ఓ అద్భుత కార్యం సాకారం
ప్రతికూలత సానుకూల శక్తిగ మలుచు దీపం

దీపారాధన.. మోక్షాన్నిచ్చు
మనిషిని ప్రకాశింప చేసే ఆత్మజ్యోతి
ఙ్ఞాన వ్యాప్తి వితరణకు సంకేతం
వాతావరణం శుభ్రం..శుభప్రదం..సురక్షితం

పవిత్ర పరంజ్యోతి ఆరాధన
తిమిరాన్ని తరిమే దీపారాధన 
నీ అంతర సంస్కారం ఉద్దీపనం
కష్టాలు మైమరిపించి మురిపించే దీపారాధన


కామెంట్‌లు