: ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు.;-కుసుమంచి నాగమణి.;-చరవాణి: 8897334922.
సాహితీ బృందావన జాతీయ వేదిక.
ప్రక్రియ: సున్నితం.
రూపకర్త: శ్రీమతి నెల్లుట్లసునీత గారు.
************
సాహిత్య నూతన ప్రక్రియ.
సరళ పదజాల ప్రక్రియ.
ద్వితీయవార్షికోత్సవం జరుగుతున్న ప్రక్రియ.
చూడచక్కని తెలుగు సున్నితంబు.

విద్యార్థులు ఆసక్తి కనబరిచేది.
సునీతగారి చేతిలో రూపుదిద్దుకుంది.
మూడు పదాలతో మిళితమైనది.
చూడచక్కని తెలుగు సున్నితంబు.

తెలుగుభాష ఔన్నత్యాన్ని చూపేది.
సులభమైన పదజాలంతో కూడుకున్నది.
అంశాలను చక్కగా వివరించేది.
చూడచక్కని తెలుగు సున్నితంబు.

వారానికి ఒక అంశము.
కవిమిత్రులకు నూతన ఉత్సాహము.
సమీక్షలు చేయడం అద్భుతము.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

సమీక్షకుల సమయపాలన మెచ్చదగినది.
కవి  మిత్రులకు సంతృప్తినిచ్చినది.
నిర్వహణ తీరు ప్రశంసనీయమైనది.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

************


కామెంట్‌లు