డా.ఏ.పి.జే.అబ్దుల్ కలాం 91 వ జయంతి-ప్రపంచవిద్యార్థులదినోత్సవం-పద్యాంజలి"!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
సీసమాలిక.
రామేశ్వరమునందురత్నమైభాసిల్లి
భరతజాతికతండుభాగ్యమయ్యి
అతినిరాడంబరుడతినిగర్విగ జీవి
తంబునుగడిపియుధరణిపైన
క్షిపణిశాస్త్రపుకీర్తిరెపరెపలాడించి
శాస్త్రవిజ్ఞానమ్ముసతమునేర్చి
దేశగరిమపెంచితేజోమయంబుగా
సత్తానుచాటించిశక్తిమీర
శాస్త్రసాంకేతికసాగరమ్మునునీది
విశ్వవిఖ్యాతుడైవెలుగులీని
నిత్యప్రయోగాలునియమముగనుసల్పి
సఫలీకృతమునొందిసద్వివేకి
ప్రజలరాష్ట్రపతిగపాలనమ్మునుజేసి
పలుసంస్కరణలకుపాటుపడియు
విద్యాభివృద్ధికివిలువైనసందేశ
ములనందజేసియువిలువనొంది
(తే.గీ.)
ఏపిజేయబ్దులుకలాముతాపసిగను
కను‌లముందరకనిపించి,కలలుకనుము

 ననుచుబోధించియువతకుననుదినంబు
జాగృతినికలిగించెనుజయముమీర!!!



కామెంట్‌లు