: శ్రీ మహాలక్ష్మి దేవి;-'వాజ్ఞ్మయ రత్నాకర' " రసస్రవంతి " 'వాజ్ఞ్మయ భూషణ'" కావ్యసుధ " జంట కవి రచయితలు 9247313488

  సంపదలనిచ్చే మహాలక్ష్మి చిత్కళ,మనసే ఆ తల్లి వాక్కు. జన్మద చిదానందమే ఆమె భక్తులకు ప్రేమామృతంగా భాసిల్లుతుంది. లక్ష్మీదేవి ప్రేమ స్వరూపిణి, చంద్ర సహోదరి లోకాన్ని ప్రేమ స్వరూపంతో పాలించే జగన్మాత మహాలక్ష్మి దేవి. లక్ష్మి దేవి కరుణాకటాక్షముతో అదృష్టం అర్ణవంలా పొంగిపోతుంది. శ్రీ మహాలక్ష్మి చంద్ర సహోదరి కనుక తనను భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది.
మహాలక్ష్మి దేవి కామ, క్రోధ, లోభ ,మోహ ,మద, మాత్సర్యములనే  అరిషడ్వర్గములను అణచి, భక్తులకు పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనమును ,ధనాన్ని, పశుసంపదను ,అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులుగా చేయు కరుణామయి. సూర్య చంద్రాగ్ని  సమాన ప్రకాశ తేజోరాశి.
 శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ షష్టినాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి. దుర్గ సప్తశతి అంతర్గతమైన దేవి చరిత్రలో ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి అనే రూపాన్ని ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేసిందని చెప్పబడింది. లోక స్థితిలయకారిణిగా , ధన ,ధైర్య, విజయ , సౌభాగ్య , సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి స్వరూపమైన అమృత స్వరూపినిగా దుర్గమ్మను మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తారు.
 ఆరో రోజు అలిగిన బతుకమ్మ
 ఆరవ రోజున అమ్మవారికి పూలతో ఎలాంటి అలంకరాన్ని తయారు చేయరు ఒకప్పుడు అమ్మవారిని పేర్చే సమయంలో మాంసపు ముక్క తగలడంతో అమ్మవారికి అపచారం జరిగిందని ఆరో రోజున బతుకమ్మ ఆడరు. ఈరోజు నా నైవేద్యం ఉండదు.

కామెంట్‌లు