అరవై ఏళ్ల భద్రయ్య బలే చాదస్తుడు. ఆయనకున్న గుడ్డి నమ్మకాల్లో ముఖ్యమైంది. ఇంట్లోంచి బయటికెళ్లేటప్పుడు ఎడమకాలు ముందుగా బయటపెట్టడం. ఇంట్లోకి తిరిగి వడ్డేప్పుడు కుడికాలు ముందు లోనికి పెట్టడం. అప్పుడు వెళ్లిన పనులు సక్రమంగా జరిగిపోతాయని ఆయన గట్టి నమ్మకం ఒకరోజు భద్రయ్య ఒక ముఖ్యమైన పని గురించి బయటకెళ్లాల్సి వచ్చింది. ఐతే పని తొందరలో తన నమ్మకాన్ని మరచిపోయాడు. కుడికాలు బదుటపెట్టబోయాడు. అప్పుడే హఠాత్తుగా గుర్తుకొచ్చింది. కుడికాలు వెనక్కు తీసుకొని. ఎడమకాలు ముందుకు పెట్టబోయాడు. ఆ ప్రయత్నంలో తడబాటు వల్ల అతడి భారీ శరీరం అదుపు తప్పింది. ముందుకు తూలాడు. ఆ ముందున్న మురికి కాలువ పై వేసిన బండరాయి మీద పడ్డాడు. పైగా ఎడమకాలు తిరగబడింది. కూలబడ్డాడు. తుంటి ఎముక విరిగిపోయింది. లేవలేక అరిచాడు. అంతే! భద్రయ్యను ఆ పల్లె నుండి పట్నం తరలించారు. ఎముకల డాక్టరు అన్ని పరీక్షలూ చేయించి, ఎక్స్ రేలు తీయించి కనీసం మూడునెలలు మంచం మీదే గడపాలని సూచించాడు. కట్లు కట్టాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఇక ముందు ఈ గుడ్డి నమ్మకాలను వదిలేయాలని భద్రయ్య నిర్ణయించు కొన్నారు. అందుకే చిన్నారులూ! సమయమూ, సందర్భమూ, ఆరోగ్యం అన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. మూఢనమ్మకాలను వదిలేయాలి
మరి!
మరి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి