స్వాతంత్య్ర వజ్రోత్సవాలు;-మమత ఐలహైదరాబాద్9247593432
 *తరంగాలు* (నూతన ప్రక్రియ పోటీ);
*****************************
1
స్వాతంత్ర్య సమరంబు జరిపిరానాడు
స్వాభిమానం కొరకు పరుగులీనాడు
స్వతంత్రదేశమున సమతనే పెంచి
శోభాయమానంగ బ్రతుకవలె నేడు
2
సమరయోధుల కళలు నిలబెట్టి చూడు
భరతుడేలిన ఖ్యాతి కనిపించునపుడు
శ్రమకోర్చి రణమెంచి సంకెళ్ళబిగి తెంచి 
భరతమాతకు స్వేచ్ఛ పలికినామపుడు
3
దేశాన్ని పాలించ ఘననాయకులచే
రాజ్యాంగ భాగాల రచన కొనసాగి
పాశముగ వర్ధిల్లి భరతావనంతా
దేశమంతట నిండె వజ్రోత్సవాలు 

కామెంట్‌లు