నేషనల్ లైబ్రరీ;-కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445

 మన దేశంలో అతిపెద్ద గ్రంథాలయం కలకత్తాలో ఉన్న ' నేషనల్ లైబ్రరీ'. దీనిని అప్పటికలకత్తా యువరాజు ద్వారకా నాథ్ టాగోర్ 1836 మార్చ్ 21న స్థాపించాడు.అప్పటినుండి ఈ గ్రంథాలయాన్ని వివిధ రకాలుగా అభివృద్ధి చేశారు.
       మొదట దీనిని 'కలకత్తా లైబ్రరీ' అనేవారు.అనేక చిన్న గ్రంథాలయాలనుండి పుస్తకాలు సేకరించి దీనికి 'ఇంపీరియల్ లైబ్రరీ' అని పేరు పెట్టిఅప్పటి బ్రిటిష్ వైస్ రాయ్ లార్డ్ కర్జన్ చేత 1903 జనవరి30 వతేదీన ప్రారంభోత్సవం చేయించారు.
       స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దీనికి 'నేషనల్ లైబ్రరీ' అని పేరు మార్చారు.దీనిలో రమారమి రెండు మిలియను పుస్తకాలు ఉన్నాయి! సుమారు 500 మంది కూర్చుని చదువుకునే ఏర్పాటు ఉంది.ఈ గ్రంథాలయం మొత్తం సముదాయం నాలుగు పెద్ద భవనాలలో ఏర్పాటు చేశారు. రోజుకు సమారు 1000 మంది పాఠకులు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు! సర్ అసుతోష్ ముఖోపాధ్యాయ అనే కలకత్తా ప్రముఖుడు తాను సేకరించిన 72000 అరుదైన పుస్తకాలు 1949 లో ఈ గ్రంథాలయానికి ఇచ్చాడు. 
      మనదేశంలో కాంచీపురానికి 3కి.మీ. దూరంలో ఎనత్తూర్ లోఏకైక ఆధ్యాత్మిక గ్రంథాలయం ఉంది. హైదరాబాద్ లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం విజయవాడలో రామమోహప ధర్మ పుస్తక భాండాగారం, రాజమహేంద్రవరంలో గౌతమీ గ్రంథాలయం, ప.గోదావరి లోని కుముదపల్లిలో వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం ప్రసిద్ధి చెందినవి పురాతనమైనవి.
                     *****      *******

కామెంట్‌లు