బతుకుకథ బడి!;-డా. పి .వి .ఎల్. సుబ్బారావు, 9441058797.
బాల పంచపది
============
1. అమ్మఒడి అసలు బడి! 
ఎప్పటికీ ఉండే ఆకుమడి!
 మమతల పూర్ణ ఏలుబడి!
 దేవతలందరూ ఉన్న గుడి!
అమ్మఒడి,
 బతుకుకథ బడి, రామా!

2. అమ్మఒడి ఆర్ద్రత తడి!
    ఆప్యాయతల దిగుబడి! 
విరామాన ఆనందాల సందడి!  
   పోరాటాల ఓదార్పుల దడి!
అమ్మఒడి ,
  బతుకుకథ బడి, రామా!

3.వెనుకబడితే ప్రోత్సాహము!
 ముందుకుతోసే ఉత్సాహము!
 నీకోసమే నిత్యం ఆరాటము! 
 అమ్మ ఒడి సదా నీకోసము!
అమ్మఒడి,
 బతుకుకథ బడి, రామా!

4. అమ్మఒడి,
            బిడ్డ పూల పాన్పు !
    జోల పాటతో,
                       నిద్ర నేర్పు!
   అల్లరికి,
            గోరుముద్ద తీర్పు! 
  హాయికి,
         వెన్నముద్ద చేర్పు!
అమ్మఒడి ,
బతుకుకథ బడి ,రామా!

5. అమ్మఒడి ,
         రత్న సింహాసనము! 
   ప్రతి శిశువు,
            రాజదరహాసము !
   ఆ కాలము 
             సరి మధుమాసము!
   తలపే చాలు,
               ఏమా పరవశము!

6. ఇల మరి ఎక్కడ లేనిది!
  స్వర్గాన  సైతం   దొరకనిది!
 బాల్యం అమ్మఒడి గడిచినది!
నిజం,పూర్వజన్మ పుణ్యమది!
అమ్మఒడి,
 బతుకుకథ ,బడి రామా!
________


కామెంట్‌లు