పరిరక్షణం!;-డా. పి. వి .ఎల్ .సుబ్బారావు, 9441058797.
 బాల పంచపది
============
1. పర్యావరణం ,
       పంచభూత మయము!
   పరిరక్షణ ,
             మానవ కర్తవ్యము!
   నేటి ,
     పర్యావరణ కాలుష్యము!
   మానవ,
       మనుగడ ప్రశ్నార్ధకము!
   పర్యావరణ ,
        పరిరక్షణ ప్రజ్ఞ , రామా!
2. విశ్వ మానవ ,
               జీవన సమస్య!
   ధరణి అంతా,
             నిండిన సమస్య!
    విశ్వజన,
             సాధన సమస్య !
    అనేక సమస్యల ,
               మూల సమస్య!
   పర్యావరణ ,
      పరిరక్షణ ప్రజ్ఞ, రామా!
3. ప్రకృతి సహజ సుందరము! 
   ఈస్థితి కారణం అందరము!
  నిర్లక్ష్యం  ప్రమాద కారణము!
  ప్రమాదము పెద్ద శాపము!
  పర్యావరణ ,
    పరిరక్షణ ప్రజ్ఞ, రామా !
4. వాతావరణం కాలుష్యము!
    పీల్చేగాలి కాలుష్యము!
    తాగేనీరు కాలుష్యము!
  నివాసం చుట్టూ కాలుష్యము!
   పర్యావరణ ,
        పరిరక్షణ ప్రజ్ఞ , రామా!
5. కూర్చున్న కొమ్మ నరకరాదు!
పర్యావరణంపాడుచేయరాదు! బాల్యంలోనూ మరవరాదు! భవిష్యత్తు భయంకరంకారాదు!
పర్యావరణ 
   పరిరక్షణ ప్రజ్ఞ, రామా!
6. మొక్కలు పెంచాలి,
                చెట్లు కావాలి !
 వాయు కాలుష్యం తగ్గించాలి! పరిశ్రమల కాలుష్యం పోవాలి! జాగ్రత్తలు తప్పక పాటించాలి!
పర్యావరణ ,
        పరిరక్షణ ప్రజ్ఞ , రామా!
7. చర్చలు కావు ,
                చర్యలు చేపట్టాలి!
    కరోనా,
        ఓ గుణపాఠం అవ్వాలి!
   కరోనా ,
        నిర్మూలన దారిపోవాలి!
   కాలుష్య నాశన,
                   ప్రతిజ్ఞ చేయాలి!
  పర్యావరణ ,
      పరిరక్షణ ప్రజ్ఞ, రామా!
8. నేడు ,
        మనం బతకడం కాదు !
    రేపు బతుకు ,
              సమస్య కారాదు!
    కాలుష్యం,  
       వారసత్వం కాకూడదు
   సత్వరం ,
   జనం మరి  నిర్మూలించాలి!
_______'


కామెంట్‌లు