బాల పంచపది============1. రైలు చేయు, గొప్ప మేలు!రైలు ప్రయాణం సరివీలు!కిటికీ చోటు హుషారు ఏలు!పరిసరాలన్నీ సినిమా రీలు!నీవు రైలై,సరి పరుగు తీయాలి, రామా!2.ఓఊరు నుండి బయలుదేరు!మరో ఊరు చక్కగా చేరు!నిర్ణీత ఊళ్ళల్లో ఆగి తీరు! మనల్ని ఎక్కించి దింపే సౌరు!నీవు రైలై,సరి పరుగు తీయాలి, రామా!3. రైలు నడిపే ఆ డ్రైవరు!నడిపించే గార్డు, ఈ చివరు!భోగిల్లోమనం చక్కగా అమరు!ఆనందంగా మన ఊరు చేరు!నీవు రైలై,సరిపరుగు తీయాలి, రామా!4. రైలు ఎక్కి చూస్తాం ,ఎన్నో ఊళ్ళు!భలేగా తింటాం ,మరెన్నో చిరుతిళ్ళు!ఎదురొస్తారు,పాటల బిచ్చగాళ్ళు!జాగ్రత్త, దాగి,ఉన్నారు నేరగాళ్లు!నీవు రైలై,సరి పరుగు తీయాలి, రామా!5. జేమ్సవాట్ ,ఆవిరి యంత్రము!ఓనాడు,రైలు నడక మూలము!నేడు ,విద్యుత్తుతో వేగవంతము!ప్రయాణం ,కడు సుఖవంతము!నీవు రైలై ,సరి పరుగు తీయాలి, రామా!6. రైళ్లు ,సామానులూ మోస్తాయి!దేశమంతా ,తిరిగి చేరవేస్తాయి!తక్కువ ,ధరలో అందచేస్తాయి!గూడ్స్ రైళ్లు,జాతికి మేలు చేస్తాయి!నీవు రైలై ,సరిపరుగు తీయాలి ,రామా!7. రైళ్లను,నడిపేవి ఇంజనులు!వెనుక నడిచేవి ,బహు భోగీలు!నాయకులు,మన ఇంజనులు!అనుసరిస్తారు ,ఈ దేశ పౌరులు!నీవు రైలై,సరి పరుగు తీయాలి, రామా!8. రైలు ,కూత వేస్తూ వస్తుంది !ఆగి,మరల కూత వేస్తూ వెళ్తుంది!అలసట లేక,పరుగు తీస్తుంది!నిత్య చైతన్య,గురుతై నిలుస్తుంది!నీవు రైలై,సరిపరుగు తీయాలి, రామా!_________
మైళ్ళు ఉరుకు!;- డా.పి. వి.ఎల్.సుబ్బారావు, 9441059797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి