గజరాజు!;-డా పి .వి .ఎల్ .సుబ్బారావు, 9441458797..
బాల పంచపది
  ==========
1. ధన్యుడు గజాసురుడు!
    గణపతి గజాననుడు!
   మేటిభక్తుడు గజేంద్రుడు!
   ఐరావతాన దేవేంద్రుడు!
    ఏనుగు ఎక్కిన ,
   యశము కలుగు , రామా!

2. మాఊరు వచ్చింది ఏనుగు! 
   చెరకుగడలు తింది ఏనుగు !  
 వెలగపళ్ళు మింగింది ఏనుగు!
 మంచినీళ్లు తాగింది ఏనుగు!
  ఏనుగు ఎక్కిన,
    యశము కలుగు, రామా! 

3. ఏనుగు రంగు నల్లన!
    ఏనుగు దంతాలు తెల్లన!
    ఏనుగు నడక మెల్లన!   
    ఏనుగు చూపు చల్లన! !
  ఏనుగు ఎక్కిన,
   యశము కలుగు, రామా! 

4. ఏనుగు నడుపు,
              మావటివాడు!
    ఏనుగు మీద ,
         అంబారీ చూడు !
    ఏనుగు మీద,
             మన రాముడు!
     ఎంతో చక్కని ,
               ఘన  దేవుడు!
    ఏనుగు ఎక్కిన,
        యశము కలుగు ,రామా!

5. దేవ ఉత్సవాల ఏనుగు!
    సర్కస్ ఫీట్లలో ఏనుగు,!
    సినీ నటనలో ఏనుగు!
    వేయి వరహాల ఏనుగు!
    ఏనుగు ఎక్కిన,
    యశము కలుగు,రామా!

6. కుక్కలు మొరిగిన,
                         లెక్కలేదు!
   యుద్దాన,
                 సరి ఎదురులేదు!
   అడుగు ఎత్తితే,
                 గుండె కొట్టుకోదు!
    తొక్కిందా మరి ,
                అంతము తప్పదు!
   ఏనుగు ఎక్కిన,
   యశము కలుగు, రామా!
_________


కామెంట్‌లు