పరువుకు ఊరితాడి(నీతికథ)-ధనాశి ఉషారాణి భాకరాపేట తిరుపతి జిల్లా9441803495
 చక్కని  సొగసులు నిండిన చక్కని చిరునామాకు పుట్టినిల్లు  పక్కనే చిన్న పల్లెటూరు బాతుగుడెము   దేవుని లీలలను  అంచనా  వేయుట ఎవ్వరి తరము సుమీ  తినడానికి తిండి దొరకని చిన్న పాకలో  మేకలు కాచుకునే ఓ చిన్న పేద కుటుంబము ఉండేది  పేరు మాత్రమే సుందరము రూపములో సౌందర్యవతి కాదు సుజిని.ఐనా  ఓ రోజు అదృష్టము తలుపు తట్టింది పక్కన వున్న జిల్లా నుండి ఓ ఇంటికి వంశ ఉద్దారకుడు  కోసము రెండో భార్యగా పిలుపువచ్చింది 
ఐతే అంతులేని ఆస్థి వ్యవసాయం పొలాలను  కలిగిన  ఇంటికి కోడలు బాధ్యత  ఐతే ఆది  వయసులో సుజితది సగం  వయస్సు మాత్రమే.సుజిత  ఇంటికి రాగానే  ఇంతకు  ముందు వున్న అమ్ములు పెద్దకోడలు ఇంటికి శాశ్వతముగ
ఇంటికి దూరం ఐపోయింది. ఒక్క వరలో రెండు బాకులు  ఇమడవు  కదా. గొడ్రాలు ఐనా  పర్వాలేదు ఇంటికి వారసుడు రావాలని పెద్ద భార్య అమ్ములు  తన  భర్తకి  ఇంకో పెళ్లి చేసిన  తను  మాత్రము ఎవ్వరూ లేని ఏకాకీలా ఇళ్లు విడిచి గూడు చెదిరిన  పక్షివలేను అలా ఎగిరిపోయింది.ఇలా  కాలము గడిచింది  చుస్తూ  ఉండగానే ఇద్దరు
వారసులు  వచ్చారు అలా  లెక్కకు లేని అంత  డబ్బులు గుట్టలు వచ్చి పడింది ఎక్కడ చూసినా  ఎకరాలు కొద్ది పొలాలు  చేతికి  వచ్చాయి. లెక్కలేని బంగారు ఎక్కడ చూసిన మిలమిల  మంటూ అందరినీ  ఆకర్షణకు గురిఅవ్వగా  గర్వము తలెక్కిoది .విందులు వినోదలా  మత్తులో నిండుగా  తూలి తుల్లి పడ్డాడు ఆది. ఇంటి చుట్టూ  గుంట  నక్కలు చేరారు. అందినంత దోచుకొనే గుంట  నక్కలు నక్కి నక్కి చూడ సాగారు. ఇంటి బాధ్యత  తెలియని  సుజిని అందినoత  పుట్టిoటికి చేర్చడముతో కారుల్లో తిరిగే స్థాయికి చేరారు. మధ్యము మత్తులోన ఆది  ఉండగా  డబ్బులు పక్కదారికి  పట్టించడము నేర్చుకుంది సుజిని.అదే ఊరిలో ఇంటి ఆడపడుచు పుట్టింటి మీద  ఏప్పుడూ కన్నేసి ఉంచేది. అందినంత  దొరికింది దోషము  లేదు అన్నట్టుగాను పట్టుకెళ్ళేది.తాగుబోతు  భర్త  బాధ్యత  లేని ఇల్లాలు ఇంకేముంది ఇల్లే వళ్ళకాడుగా  మారిపోయింది. అసలే భర్తకు  వయస్సు ఎక్కువ
రాను రాను  ఊరిలో  అందరికేసి చూసేది  పరువాలను  మోయలేక  పోయేది. వరుస  లేని వారి కేసి తదేకoగా  చూస్తూ  ఉండేది సుజిని. ఐతే పెళ్లికానీ  కుర్రోళ్ళకు దగ్గర అవ్వడము అలవాటుగా  మారిపోయింది. ఊల్లో  ఆడోల్లు గుసగుసలాడటము పనిగా  పెట్టుకున్నారు. ఇవ్వన్నీ తెలిసి సుజిని శరీరాన్ని గాయాలతో బాధించి  హింసించినా  మారలేదు. ఇలా  ఒక్కరి తరువాత  ఒక్కరితో కుర్రోల్లతో  చనువుగా  ఉండటము మార్లేదు సుజిని . తన భర్త పరువును
తీసే వాళ్లు ఎక్కువ ఇపోయారు. ఊరు  మొత్తము  కుట్రపన్నీ  కుతంత్రాలుతో  నిండిపోయింది.
వీధుల్లో వెళుతుంటే అలుసుగా చూస్తూ అవహేళనా చేస్తున్నా సుజిని మారలేదు. ఇలా పరాయి  వాళ్ళతో  చనువుగా వున్న ప్రతిసారి
పథకము పన్ని పట్టుకుంటున్నా చీము  రక్తము  చచ్చిన  పాముగా మారింది గానీ  మార్పు రావాలని ప్రయత్నం చేయలేదు. ఆది సహనము  కి హద్దు లేదు  సుజిని తప్పులకు అడ్డు లేదు. ఎలాగైనా  సరే ఆధారాలుతో పాటు  పట్టుకున్నాడు ఆది. చేసిన  తప్పులను విప్పి చెప్పి మారమని అడిగాడు. సుజిని పుట్టిoటికి చేరిoది భర్తపై కేసు వేసింది కోర్టులో ఆస్తులు కోసం విడాకులుకు సిద్ధము ఐపోయింది. కానీ  మగాడు  లేని ఆడది  ఎలా  బతుకుతుందని జాలి  చూపాడు  ఆది. కొడుకులును ఇచ్చి ఇంటికి వారసులు ఇచ్చిన  సుజిని అంటే లోలోపల చేప్పలేని అభిమానం.పుట్టింటి నుండి అత్తారిoటికి సుజిని వచ్చింది. పనులు చేసే  దారిలో  విసుగొచ్చింది ఆదికి . కుక్కతోక  వంక  మరి మారలా  తన  కొడుకు వరుసున్న చిన్న వయసు  వారితో
తతంగము మొదలు  పెట్టింది. ఏదోమిటో చిత్రము  కుర్రోల్ల మోజులో పడి తన శరీరమును అస్లీలముగారు ఫోనుల్లో బంధించి  కుర్రకారు ఊరంతా  పరువును తీసినా  తెలుసుకోలేని స్థితిలోకి సుజిని చేరింది. ఇది తెలిసి ఆది ప్రాణాలు తీసుకోవాలని తెగించి బిడ్డలు అనాథలవుతారని  గుండె విరిగి మోడుగా  నిలిచినాడు ఆది. బంధువులు అందరికీ  ఇంటిగుట్టు తెలిసిపోయింది. ఊరు  అంత   పుకార్లు షికార్లుగా  చెక్కర్లు కొట్టాయి. ఆది విచక్షణ  మరిచాడు  భార్యను పోలీస్ స్టేషన్ కి లాగాడు. ఊరి వాళ్ళ  ముందు పంచాయితీ  పెట్టాడు కుక్కకాటుకు  చెప్పుదెబ్బ అన్నట్టు  తన  ఇంటి పరువుకి ఊరితాడు  బిగించిన  సుజిని చేత  చెప్పుతోటి  కొందరికి బుద్ది చెప్పించాడు. ఊరు  ఊరు గజగజలాడిoచాడు ఆది. మగాడు  చేసిన  తప్పును నీలదీయని  సమాజము. ఆడదాని  తప్పును గట్టిగా చాటిoపు  వేస్తుంది. తప్పులు దిద్దుకోవాలి తన  బ్రతుకుకు  ఊరితాడును ఆడపిల్ల బిగించుకోకూడదని కన్నీరు పెట్టి కుటుంబ  బాధ్యతను  ప్రతి ఇల్లాలు పట్టించుకోవాలని తప్పు నిప్పులా పరువును దహిస్తుందని  తెలుసుకుంది సుజినీ బతుకులో పరాయి  మగాళ్లు  ముప్పని కనువిప్పు కలిగింది సుజనికి.

కామెంట్‌లు