పేరులోనే వుంది-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 పిల్లల నామకరణ మహోత్సవానికి తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి బిడ్డ భవిష్యత్తు బాగుండాలని  పెద్దల సలహాతో చక్కటి పేరు పెడతారు. తనకు తన వంశానికి పేరు తీసుకురావాలని వారి ఆకాంక్ష. కానీ ఇవ్వాళ పిల్లలు కలం పేరుతో వాళ్ల ఇష్టమైన పేర్లు  పెద్దలకు తెలియకుండా ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా ఏర్పాటు చేసుకున్న చలం గారి కుదురు గుడిపాటి.  తల్లిదండ్రులు పెట్టిన పూర్తిపేరు గుడిపాటి వెంకటాచలం  తిరుపతి వెంకటేశ్వర స్వామి  ఏడుకొండలలో ఒక కొండ పేరు  అంత పవిత్రంగా ఉండాలని, అంత గొప్ప పేరు తీసుకురావాలని పెద్దల  ఆలోచన. ఊహ తెలిసి తండ్రి గారి మీద భయంతో వాటిని దూరం చేసుకొని తన సొంత ఆలోచనలతో  పేరు మరీ పెద్దదవుతుంది రెండక్షరాలు చాలు అన్న అభిప్రాయంతో చలం అన్నపొట్టి పేరు పెట్టుకున్నారు  ఊహ తెలిసి  ఆంధ్ర భాష మీద పట్టు దొరికిన తరువాత  తాను చేసిన పని చాలా మంచిదని ఆనందించాడు కూడా  పెద్దలు పెట్టినట్టుగా  వెంకట అచలం  కలిస్తే వెంకటాచలం ఒక చోట స్థిరంగా ఉండాలని అభిప్రాయంతో ఆ పేరు సార్థకమవుతుంది అనుకున్నారు. కానీ  ఉద్యోగరీత్యా అనేక చోట్ల తిరిగిన చలం గారు  తిరగడానికి ప్రాధాన్యత నిచ్చాడు. ఒకచోట ఉండడానికి వారి మనసు అంగీకరించలేదు. వారికి బాగా ఇష్టమైన ప్రదేశం భీమిలి  సముద్రతీరం, ఇసుక మైదానం  విపరీతమైన చెట్లు ఉన్న ఆ ప్రదేశం  ఆ ప్రకృతి వారిని బాగా ఆకర్షించాయి. వారి పిల్లలకు కూడా సౌరిస్ పకపక అని పేర్లు పెట్టారు. పకపకా ఏమిటండి అని అడిగితే  దానితో మీరు మాట్లాడండి  మీ ప్రతి మాటకు కూడా నవ్వి కానీ సమాధానం చెప్పదు.  పకపకా నవ్వడం నాకు నచ్చింది  అందుకనే పేరు కూడా పకపక అని పెట్టేశాను అని  ముసి ముసి గా నవ్వుతూ  సమాధానం చెప్పారు. అందుకే  చలం గారు ప్రయోగశీలి అయినారు.  సాహితీ రంగంలో శాశ్వతమైన పేరు సంపాదించుకున్నారు.


కామెంట్‌లు