భూమి నాదన్న...;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మహాత్మా గాంధీ నుంచి  ప్రతి ఒక్కరు వ్యవసాయ దారును గురించి మాట్లాడుతూ  దేశానికి రైతు వెన్నెముక  ఎవరు ఎన్ని పనులు చేసుకుంటూ వెళ్లినా  రైతు పండించి ధాన్యాన్ని ఇవ్వకపోతే  ఏ ఒక్కరికీ నోటికి ముద్ద వెళ్లదు. కనుక రైతు దేశానికి వెన్నెముక అని వర్ణించాడు  కానీ రాజుల కాలంలో వారి దేశంలో ఉన్న పొలాలు మొత్తం వారి అధీనంలోనే వుంటాయి.  రాజులకు ఎవరు వినయంగా  వారి చెప్పుచేతలలో ఉంటారో వారికి వారి ఇష్టం వచ్చినంత పొలాన్ని దానంగా ఇవ్వడం వల్ల వారు భూస్వాముల అయ్యాడు. మరి రాజుల పాలన పోయి ప్రజల రాజ్యం వచ్చిన తర్వాత భూమి ప్రజల కే అయ్యింది. అంతమాత్రం చేత ఆ భూమి నాది అని మిడిసిపాటు తగదు ఇది ప్రకృతి ఇచ్చిన వరం దానినే వాడుకోవడం తప్పా  అధికారంతో చేజిక్కించుకునే కూడదు అని వేమన చెబుతున్నాడు.
ఏ దేశంలో అయినా అతి తక్కువ మంది డబ్బు కలిగిన వారు ఉంటాడు. ఎక్కువ మందివి సాదాసీదా జీవితాలే  విపరీతంగా ఇంటిలో జ్ఞానం ఉన్న వ్యక్తి  దానికి మరింత కలిపి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో ఉంటాడు తప్ప  సాటివారు బాధపడుతున్నారు  భోజనానికి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు వారికి సహకరించి  వారి అవసరాలను తీర్చుదాం అని ఏ ఒక్కరూ అనుకోరు కారణం  ధన దాహం ఎంత సంపాదిస్తే దానికి ఇంకా అంత ఎక్కువ సంపాదించాలన్న సంకల్పం వస్తుంది తప్ప ఉన్న దానిలో కొంత అందరికీ పంచిపెట్టి తాను కూడా సామాన్యుడు కావడం అతనికి ఇష్టం ఉండదు. అలాంటి పిసినారి వల్ల ఎంత ధనం ఉంటే ఏమి ప్రయోజనం. దానిని వేమన ఏద్దేవా చేస్తూ చెప్పిన పద్యం ఇది. దేశాలకు దేశాలకు మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి  అనేకమంది బలవుతారు  ప్రభుత్వం తరఫున సైన్యమే కాక  సామాన్య ప్రజలలో కూడా  యుద్ధ విద్య తెలిసినవారు  ప్రభుత్వ అనుమతితో వెళ్ళి యుద్ధం చేసి  విజయమో వీరస్వర్గమో అనుభవిస్తారు. కత్తి చేత పట్టి దానిని ఎలా వాడాలో  వైరి వీరుల శిరస్సులను ఎలా నరకాలో  వారు కత్తిమెడపై పెట్టినప్పుడు  దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని  కదనా వీరుడు. కదనా రంగం అంటే భయపడేవాడు  అలాంటి వాడిని చూసి యమధర్మరాజు కూడా ఫక్కున నవ్వు తాడు.ఈ మూర్తుల మనస్తత్వాలను వ్యంగ్యంగా  వేమన ఆటవెలదిలో మనము అందించారు.  ఈ పద్యం మీ కోసం...
"భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు  
దాన హీను జూచి ధనము నవ్వు  
కాదనా బీతు చూచి కాలుండు నవ్వురా..."కామెంట్‌లు