చిత్త ప్రవృత్తి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మానవుని జీవితం సక్రమంగా  సజావుగా జరగాలి అంటే ప్రకృతి మనకు సహకరించాలి. పుట్టిన మనిషికి ఆహారం లేకపోతే గిట్టడం ఖాయం.  ఆహార సముపార్జన ఎలా జరుగుతుంది. ప్రకృతి సహకరించాలి. ఆ ప్రకృతిని  తనదిగా చేసుకొని చిన్న పాదు చేసి ఒక గింజను  నాటితే  అది మొక్కగా వస్తుంది  పెరిగి పెద్దదై వట వృక్షంగా మనముందుకు రావాలంటే  దానికి కావలసినది ఏమిటి? మీరు నీరు 24 గంటలు పోస్తూనే ఉంటారా? కుదరదు కదా కనక తానే ప్రయత్నం చేసి  భూమిలో ఉన్న నీటిని తన వేళ్ళ ద్వారా సేకరించి  మానవుని  శరీరానికి రక్త ప్రసరణ ఎలా అవుతుందో  అలా ఆ వృక్షం పెరగడానికి ప్రతి భాగానికి నీటిని అందిస్తుంది ఆ వేరు అలా పెరిగి  పూలు పూచి కాయగా మారి దోరయై ఆ తర్వాత పండుతుంది. దానిని తిని మనం మన ఆకలిని తీర్చుకుంటాము. ఈ ప్రక్రియలో ఏది ఎక్కడ ఎలా లోపించినా  చివరకు వచ్చే ఫలితం శూన్యం కదా. ఆ చెట్టు చిగుళ్ళు ఎండడానికి కారణం వేరు నుంచి నీరు రాక పోవడం  అప్పుడు ఏం జరుగుతుంది  కాండం ఎండిపోవటం మొదలుపెడుతుంది. అది ఎప్పుడు ప్రారంభమైందో  అప్పుడు ఆ చెట్టు కొమ్మలు ఎండిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతాయి. అయితే కొంతమంది అనవచ్చు  అది  పనికి రాక పోవడం ఏమిటి  ఎండిన చెట్టుని కట్టెలు కొట్టి  పొయ్యిలో పెట్టి మనకు కావలసిన పదార్థాలను తయారు చేసుకోవచ్చు కదా అని అంటారు. కానీ వేమన దానిని మానవ శరీరానికి సమన్వయపరిచి  అద్భుతమైన వేదాంతాన్ని చెప్పాడు. వేదాంతం అంటే విద్ అంత్  ఏది తెలుసునో  దాని చివర అన్నీ తెలిసిన తర్వాత ఇంకా తెలియవలసి ఉన్నది ఏమున్నది అన్వేషించి దానికోసం ప్రయత్నం చేయడం  అని వేదాంతులు చెప్పే అర్థం.
వేమన చెప్పిన అర్థం ఏమిటంటే  మానవుని మస్తిష్కం లో ఉన్న ప్రతి నరం పని చేయడానికి కారణం చిత్తం. మనసు ప్రేరణ లేకుండా  మెదడు ఆలోచించదు  ఆ మనసు శిథిలమయింది అనుకుంటే మనిషికి కోరికలు ఎందుకు ఉంటాయి అవి చనిపోతాయి కదా. కర్మ యోగంలో ఉన్న ఎవరైనా సరే ప్రకృతిని గ్రహించాలి. ఏదైనా కార్యాన్ని సాధించాలని ప్రయత్నించే వారు ఎవరైనా  తమ దృష్టి చెదరకుండా ఉండాలంటే  యోగి వేమన చెప్పిన అమనస్కయోగం పైన దృష్టి వుంచవలసిందే తాము ఏ మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నారో దాని వైపు ప్రయాణం చేసి తీరవలసిందే  కనుక బుద్ధ భగవానుడు చెప్పినా శంకరాచార్య చెప్పినా ముందు కోరికలను చంపు అనే కదా దానిని వేమన తన ఆటవెలదిలో చక్కగా మనకు అందించారు అది చదవండి.

"చిత్తమనేడి వేరు శిథిలమైనప్పుడే  
ప్రకృతి యనెడి చెట్టు పడిన పిదప   
కోర్పులనెడి పెద్ద కొమ్మలెండును కదా..."


కామెంట్‌లు