ఆస్తిక నాస్తిక భేదం;-ఏ. బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 దేవుడు ఉన్నాడా? ఎవరైనా చూశారా? మాట్లాడారా? ఉన్నది దేవుడా భగవంతుడా!  వివరాలు ఏమైనా చెప్పగలరా  అని హేతువాది గానీ, నాస్తికుడు గానీ అడిగితే దానికి సమాధానం లేదు. ఈ ప్రశ్న మొదటి వచ్చింది వివేకానంద స్వామికి తన గురువు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నప్పుడు  నీవు దేవుని చూశావా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామకృష్ణ పరమహంస నేను నిన్ను ఎలా చూస్తున్నానో  నీతో నేను ఎలా మాట్లాడుతున్నానో అమ్మవారితో అలాగే మాట్లాడతాను అమ్మవారిని అలాగే చూస్తాను అని సమాధానం మరి నాకు అమ్మవారిని చూపిస్తారా అని అడిగినప్పుడు  చంప పగిలేలా చెంప దెబ్బ కొట్టాడు. రెండు నిముషాలు తేరుకోలేదు తేరుకున్న తర్వాత అదేమిటి స్వామి అమ్మవారిని చూపించమంటే కొట్టారు అన్నారు ఎందుకంటే దానిని తర్వాత చెప్తాను ముందు నేను కొట్టిన దెబ్బకు పరిస్థితి ఏమిటి  అన్న ప్రశ్నకు అంతా అయోమయంగా ఉంది అంతా చీకటిగా ఉంది అని సమాధానం చెప్పాడు అదే చీకటి అక్కడికి వెళితే జ్యోతి ఎలా ఉంటుందో తెలుస్తుంది  దానికి ప్రయత్నం చేయాలి  అన్నాడు.జరిగిన కథను అలా ఉంచితే  మనిషి దేవాలయాలకు ఎందుకు వెళుతున్నాడు అని ఆలోచించాలి. తొక్కితే రాయి మొక్కితే  దేవత  అన్న విషయం తెలిస్తే  మీరు ఎందుకు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారో మనకు అర్థం అవుతుంది. హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో  పండుగలలో  ఉన్నది శాస్త్రీయ దృక్పథం  భౌతికమైన శరీరం లేకుండా ఆధ్యాత్మిక స్థితి లేదు  శరీరమాద్యం ఖలు ధర్మసాధనం  అని ఉపనిషద్వాక్యం. బుద్ధుడు  మనకు తెలియని శక్తి ఏదో ఉన్నది దానిని చూద్దామని తపస్సు చేసినప్పుడు నీరసించిన  సిద్ధార్థకు  ఆయన ప్రథమ శిష్యుడు ఆనందుడు మీరు తపస్సు నుంచి లేవండి  మీరు శరీరాన్ని వదలడానికి సిద్ధంగా ఉన్నారు  ఇంతకాలం మీరు చేసిన తపస్సిద్ధి  ఏమిటి మీరు తెలుసుకున్న విషయాలు  ప్రపంచానికి తెలియ చెప్పకపోతే ఎలా  అన్న సందర్భంలో  శరీరం లేకుండా ఏమీ చేయలేం కదా అన్న నీతి బయటపడుతుంది.
వారు చెప్పిన నాలుగు మార్గాలు,  8 పద్ధతులు  తెలిస్తే  సుఖమైన జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. సాధకుడు లేదా భక్తులు  దేవతనో, భగవంతుదినో, చూడ్డానికి బయలుదేరి  పరగడుపున నదీస్నానం చేసి  కొండనెక్కి అక్కడ ఉన్న దేవాలయంలో ఆ విగ్రహాలు చూస్తాడు. దాని మీద నమ్మకం ఉన్నవాడికి ఆనందాన్ని కలుగజేస్తుంది లేనివాడికి ఇదొక రాతిబొమ్మ అనిపిస్తుంది. పరగడుపున ఎన్నో మెట్లు ఎక్కి నీరసించి పోయి కళ్ళు బైర్లు కమ్మి తిన్నగ ఆలయంలోకి వెడితే అక్కడ ఉన్న విగ్రహం నీకు కనిపించదు  అంతా చీకటిగా ఉంటుంది  కనుక దేవాలయం చుట్టూ మూడు సార్లు తిరగమని చెబుతారు. భౌతిక, ఆధ్యాత్మిక, అధి భౌతిక విషయాలను పక్కన పెడితే శారీరకంగా రక్త ప్రసరణ సక్రమంగా ఉండడం కోసం నిన్ను నీవు తెలుసుకోవడం కోసం మూడు సార్లు తిరిగి లోపలికి వెళితే  అక్కడ పురోహితుడు చిన్న దీపంతో  స్వామివారి దర్శనం చేయిస్తాడు. దర్శనం అయిన తరువాత పుష్టాన్ని ఆనించమంటారు అంటే కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని  ఆ సమయంలో  పురోహితుడు ప్రసాదం పేరుతో  పాయసం గానీ, పులిహోర గానీ పెరుగన్నం కానీ దోసిలి నిండా పెడతాడు.  అప్పటివరకూ పరకడుపుతో ఉన్న  భక్తుడు  అది తిని మళ్లీ శక్తిని పుంజుకొని కిందకు దిగి వచ్చి  నదీ జలాన్ని శిరస్సుపై జల్లి  ఇంటికి వెళతాడు ఎంతో ఆనందంగా. అదే హేతువాది  ఏమిటి మనం చూసింది ఒక రాయినా అని విసుక్కుంటాడు   భగవద్గీత మొత్తం మూడు పదాలు చెప్పింది. కర్మ, జ్ఞానం, భక్తి  శంకరాచార్య చెప్పినది 18 అధ్యాయాలలో ఈ మూడు శబ్దాలే. నీ పని నువ్వు చెయ్యి  ఆ చేసే పని అర్థం చేసుకుని చేయి, అర్థం అయిన తర్వాత  దానిపై శ్రద్ధ పెట్టి  అంకితభావంతో చేయి దాని ఫలితాన్ని ఆశించ వద్దు అని చెప్పడంలో అర్థం  ఏ పని  నమ్మి మనం చేస్తామో ఆ ఆనందం ఇంతా అంతా అని చెప్పడానికి  భాష చాలదు.  అందుకే కోరుకున్న వారికి కోరుకున్నంత మహాప్రభో అన్న సామెత ప్రజాబాహుళ్యంలో ఉంది.

కామెంట్‌లు