తపో మహిమ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితంలో ఏదైనా కార్యం  సాధించాలి అంటే అంకితభావంతో దాని మీదే మనసు పెట్టి  నిరంతర కృషి చేయడం వల్ల సాధించగలుగుతారు  అలాంటి వారికి ఎన్నో  అవరోధాలు  ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎదుర్కొని మనసును నిశ్చలంగా వుంచడం వల్ల ఎంత ఘనకార్యం అయినా సాధించవచ్చు ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది అనుసరించే వారి పరిస్థితి ఏమిటి ?  అతడు మానవమాత్రుడు కదా జీవితంలో అన్ని అనుభవించిన వాడు  వాటినిమరచి పోవడం ఎలా  తపస్సు అంటే తనను తాను గౌరవించుకోవడం అంటే అర్థం కాదు తన కోర్కెలను, వచ్చిన ఆలోచనలను దహించి వేయాలి అప్పుడు ఎలాంటి అవరోధాలు రావడానికి అవకాశం ఉండదు. ఆధ్యాత్మికంగా ఏం చెబుతారు  తపస్సు వల్ల అతను ఇంద్ర పదవిని పొంది అక్కడ ఉన్న ఇంద్రుని స్థానాన్ని  వశం చేసుకుంటాడు అన్న భయంతో  రంభ ఊర్వశి మేనక తిలోత్తమ లాంటి వారిని పంపి వీరి తపస్సు భగ్నం చేస్తాడు ... ఇలా తపస్సమాధిలోకి వెళ్ళినప్పుడు పద్మాసనంలో 7 నిమిషాలు కూర్చున్న సమయంలో కాళ్ళలో రక్తప్రసరణలోపం వల్ల తిమ్మిరి ఎక్కుతుంది. దానితో అతని దృష్టి  దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తారు లేకపోతే దాన్ని దేని కోసం ప్రయత్నం చేస్తున్నాడో దానిని ప్రక్కన పెడతాడు రంభ అనగా నితంబము  (తొడ) తొడను స్వాధీనం చేసుకున్న తర్వాత ఊర్వశి వస్తున్నది  నిజానికి  నితంబములకు మూలం కటిప్రదేశం దానిని స్వాధీనం చేసుకోవాలి అది పూర్తయిన తరువాత మేనక వస్తుంది అంటే మేను శరీరాన్ని ధరించి ఉంది దానిని జయించడానికి  విశ్వామిత్రునికి 18 సంవత్సరాలు పట్టింది. మరి మిగిలిన వారికి ఎంత సమయం పడుతోంది. శరీరం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత తిలోత్తమ దిగుతుంది  ఉత్తమమైన నువ్వు గింజ దానిని బీజంగా  వేసి దానిని బీజాక్షరం అనగా ఓంకారం చేస్తుంది.
అలా చేసేవారు కపాల మోక్షం పొందుతారు. సామాన్యుడు జిహ్వ చాపల్యం కలిగినవాడు అన్ని రుచులను చూసిన వాడు కనుక మనసు అటువైపు మళ్ళుతుంది దానిని స్వాధీనం చేసుకోవడం ఇతని వల్ల కాదు మనసు అంటే వెన్నుపూస దానికి ప్రతి విషయానికి 16108 ఆలోచనలను కలుగచేసే స్థితి వుంది. అన్ని ఆలోచనలు మనసు చేస్తున్నప్పుడు వాటికి దాసుడు అవుతాడు తప్ప ఏ కార్యాన్నీ సాధించలేడు. ఇతర విషయాల మీద కేంద్రీకరించడం  అతని వల్ల కాదు మనసు దాని ఆధిపత్యాన్ని చూపుతుంది. 
దానికి అతను బానిసత్వం వహించవలసిందే  అలాంటి సాధన చెయ్యలేని వాడు జీవితంలో కూడా నవ్వులపాలు కాగలడు అని చెప్పడం కోసం ఈ పద్యాన్ని మనకందించాడు. వేమన ఆ పద్యాన్ని మీరు కూడా చదవండి.
"అదిమి మనసు నిలిపి ఆనంద కేళిలో బ్రహ్మమయుడు 
ముక్తి బడయగోరు జిహ్వ రుచుల చేత జీవుండు 
చెడునయా..."


కామెంట్‌లు