సిద్ధార్థ;-ఏ. బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆది విష్ణు అన్న కలం పేరుతో ప్రసిద్ధమైన రచయిత. ఆర్టీసీలో పని చేశాడు. వారికి నాటకాలు వ్రాయాలన్న కోరిక ఆ శాఖ పెద్దవారి అనుమతి తీసుకొని  ఆర్టీసీ శాఖలో పనిచేస్తున్న  వ్యక్తుల జీవితాలకు సంబంధించిన సంఘటనలను కూర్చి చక్కటి నాటకాలుగా మలిచి ఆ శాఖలో నాటకం వేయాలి అన్న కోరిక కలిగిన వారిని కొంతమందిని ఎన్నిక చేసి వారితో ఆనాటకాలు ప్రదర్శింప చేసేవాడు. అతనికి జంధ్యాల మంచి స్నేహితుడు  తన రంగస్థల వేదిక కోసం ఆదిష్ణుతో కొన్ని నాటకాలను వ్రాయించుకున్నాడు. సినిమాల పై వ్యామోహంతో కొన్ని సిని కథలను కూడా తనతో వ్రాయించుకున్నాడు
చాలామంది నటీనటులను కూడా సినీ రంగానికి పరిచయం చేశాడు.
ఆది విష్ణు గారు రాసిన నాటకాలలో సిద్ధార్థ నాటకం ప్రధమ స్థానంలో నిలుస్తుంది.  ఆ నాటకం పై మా గన్నవరం ఎమ్మెల్యే  ముసునూరు రత్న బోస్  మనసుపడి  ఆ విషయం నాతో చర్చించి  దానిలో ప్రధాన పాత్ర కథకుడు,  మంచి పాత్ర అది నన్ను వేయమన్నాడు నాయనా ఇక్కడ నా బ్రతుకు లక్షల సార్లు ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని చెప్పినా ఏ రోజుకారోజు అది కాగితం మీద రాసి చదవాల్సిందే సొంత  బుర్ర ఉపయోగించడానికి వీలు లేదు అది అలవాటై బట్టీ పట్టడానికి కూడా వీలు లేని స్థితి ఏర్పడింది  అని చెప్తే ఆ బాధ్యత నాకు వదిలేయ్ పోర్షన్ వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని రోజూ రేడియో కేంద్రానికి రావడం, నా డ్యూటీ అయిన తర్వాత తన కారులో  తినుబండారాలతో సహా నిర్మానుష్యంగా ఉన్న స్థలానికి తీసుకుని వెళ్లి పాటికి పది సార్లు ప్రతి అక్షరాన్ని చెప్పించి  నా కన్నా తానే ఎక్కువ కష్టపడ్డాడు.  దానిలో ప్రధాన పాత్ర జమిందార్ అది తను వేశాడు. దాంట్లో విలన్ కోసం  మాకు చాలా సన్నిహితుడు రేడియో నాటకాలు నాతో ఆడినవాడు, పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్న పోస్ట్మాస్టర్  ఎన్ వి ఎస్ వర్మకు చెబితే ఆయన ఆనందంగా అంగీకరించారు.  గుంటూరు నుంచి కథానాయికలను పరిశీలించి రిహార్సల్స్ ను ప్రారంభించి  కబీర్ దాసు గారి తో  నిర్వహింపజేశాము. దాంట్లో మా కన్నా ఎక్కువ కష్టపడింది  నాకూ, బోసుకూ అత్యంత సన్నిహితుడు రామచంద్రరాజు  మధ్య మధ్యలో మా గురువుగారు డాక్టర్ కే వెంకట రాజు గారు వచ్చి  కొన్ని సూచనలు ఇచ్చి తుది మెరుగులు దిద్ది వెళ్తూ ఉండేవారు.  అలా నెల రోజులు ప్రయత్నం చేసి  నాటకం తయారుచేసి ప్రదర్శిస్తే  అంతా అతనిని అభినందించారు. దాని ఫలితం మొత్తం మా బొసుకు చెందుతుంది. కథానాయిక గుంటూరు లక్ష్మి ఆ వేషానికి జీవం పోసింది. గన్నవరం నుంచి తన శిష్యులను తీసుకొచ్చి వారికి కూడా వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు మా బోస్. ఒక ప్రదర్శనకు ఆదివిష్ణు గారిని పిలిచి  ప్రదర్శన అయిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని చెప్పించి  చక్కగా సన్మానం కూడా చేశాము ఎంతో ఆనందించాడు ఆదివిష్ణు. ఈ నాటకానికి వచ్చిన అభినందనలు అన్నీ మా బోసుకే చెందుతాయి.


కామెంట్‌లు