సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు*] బత్తిన గీతాకుమారి-చరవాణి:9866882029
 సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: *సున్నితం!
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
*******
సాహితీబృందావన జాతీయ వేదిక!
సరళ  వచన  కవితాపేటిక!
సున్నితం ప్రక్రియకు సాటిలేదిక!
చూడచక్కని తెలుగు సున్నితంబు!
5️⃣1️⃣6️⃣
సునీతమ్మ స్వప్న సాకారము!
భవాని యామినహల్యల సహకారము!
కవుల రచనలతో శ్రీకారము!
చూడచక్కని తెలుగు సున్నితంబు!
5️⃣1️⃣7️⃣
మూడు పదాల  పొందు
నాల్గు పాదాల విందు
మణిమయ మకుటమే పసందు!
చూడచక్కని తెలుగు సున్నితంబు!
5️⃣1️⃣8️⃣
విభిన్న సందర్భాలకు కవితాపోటీలు!
విలక్షణమైన బిరుదు పురస్కారాలు!
సముచిత సగౌరవ సత్కారాలు!
చూడచక్కని తెలుగు సున్నితంబు!
5️⃣1️⃣9️⃣
జన్మదిన ద్వితీయ వార్షికోత్సవము!
సున్నితాల సునీత జయకేతనము!
వర్ధిల్లు సున్నితమా సతతము!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు