సరదాల... పండుగా
మన దసరా...పండుగా
అందరినీ ఏకం చేసే.....అందాల పండుగ
కనువిందైన... పండుగా
కమనీయమైన....పండుగా
ఈ దసరా పండుగా......
అందరినీ దరి జేర్చే పండుగా
పల్లే పట్నం బస్తీ అంతా.........
ఆనందంతో...... జరుపుకునే పండుగ
ఈ సరదాల..... దసరా పండుగ
కొత్త బట్టలేసుకునీ.......
కొత్త చెప్పులేసుకునీ......
ఆడ మగ అంతా కలిసీ.....
ఊరు జనము ఉత్సాహంతో
అడవికి వెళ్తారు.......పాల పిట్టను చూస్తారు
గుడి ముందట జమ్మి
చెట్టును నాటి.........పూజలు చేస్తారు
కలిసి మెలిసీ అందరు కలిసి....
ఆనందంగా ఉంటారు
బంగారం పేరిట..... జమ్మి ఆకును
ఆడబిడ్డలకిస్తారు......... పెద్దవారికి దండం....బెడ్తారు
హనుమాన్ గుడికి వెళ్తారు
చుట్టూ ప్రదక్షిణ చేస్తారు......
కచేరి కాడికి వచ్చి అందరూ...,....
అలాయ్ బలాయ్ చేస్తారు
ఇదే మన పండుగ.......సరదాల పండుగ
మన దసరా పండుగ.... ముచ్చటైనా పండుగ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి