తప్పు!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆసాధువు దగ్గరికి ఓబందిపోటు వచ్చి "స్వామీ! నేను మీకోసం  అడవిలో దొరికే రకరకాల పళ్ళు సీమచింతకాయలు సీతాఫలాలు తెచ్చాను. స్వీకరించండి" అన్నాడు. కొన్ని రోజులు తిన్నాక ఆసాధువు ఆలోచనలు ప్రవర్తనలో ఏదో మార్పు కనపడ్తోంది.దొంగతనం చేయాలి అని  అబద్ధాలు చెప్పాలని వెర్రి మొర్రి ఆలోచనలు మొదలైనాయి.
సాధువుకి ఏమీ తోచక ఆబందిపోటుని అడిగాడు " నీవృత్తి ఏంటి?నాలో మంచి భావాలు తరిగి చెత్త ఆలోచనలు వస్తున్నాయి. ఆహారం తయారు చేసే  తెచ్చే వారి బుద్ధులు ఆహారంతీసుకునేవారిలో కూడా మార్పులు  తెస్తాయి.నిజం చెప్పు"అని నిలదీస్తాడు."సామీ ! నేను దొంగని.బాల్యం లో అనాధనైన నన్ను  ఈసంఘం దొంగ అని నిందమోపి మాఇల్లు పొలం కాజేసింది.ఊరిపెద్ద వల్ల నేను  దొంగతనం చేయటంలో ఆరితేరాను.కానీ మంచి గా  మారాలనుకుంటున్నాను.కానీ  అందరికీ నేనంటే హడల్! ఎలా  అందరితో కలవగలను?" "సరే!జనం గుంపుగా ఉన్న చోటుకెళ్లి నీతప్పులు చెప్పు.చాలు. "
: "అలా అందరిముందు  నేను చేసే చెడ్డపనులు చెప్పటం చాలా నామోషీ గా ఉంది. ఎలా చెప్పను? అందుకే  చెడుపనులు చేయటం మానేశాను. "ఇలాంటి  స్వాభిమానం రోషం ఉంటే  మనం చెడుపనులని త్వరగా అరికట్టి మంచి గా మారవచ్చు. ప్రతివారికీ గిల్టీ కాన్షస్ ఉంటుంది. వారికి  నయాన నచ్చజెప్పేవారు కావాలి.వద్దు అంటే చేయాలి అనే పట్టుదల పెరుగుతుందని తెలుసు కోవాలి.
కామెంట్‌లు