సమ్మోహనాలు (ముక్తపదగ్రస్థం );-ఎం. వి. ఉమాదేవి. --బాసర
సద్దులా బతుకమ్మ 
బతుకునిచ్చే వమ్మ 
అమ్మగా పూలతో శుభగౌరి ఓ వనజ !

తీరొక్క పూలతో 
పూల దొంతరలతో 
దొంతర్లు పేర్చేరు అందంగ ఓ వనజ !

మనిషెత్తుగా పేర్చు 
పేర్చి వరసలు కూర్చు
కూర్చి చప్పట్లతో తిరిగేరు ఓ వనజ !

సందమామ పాటలు 
పాట కోలాటాలు 
కోలాటమాడుతూ పాడేరు ఓ వనజ !

తీయగా మలీదలు 
మలీదతో కుడుకలు 
కుడుకలని  పదిమంది పంచేరు ఓ వనజ !

పట్టుచీరలు గట్టి 
గట్టి సొమ్ములు బెట్టి 
పెట్టి సంతసముగా  ఆ డేరు ఓ వనజ !


కామెంట్‌లు