గొప్ప! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత సుయ్ సుయ్ అని పాలు పితుకుతుంటే శివ హరి కుతూహలంగా చూస్తున్నారు. ఎప్పుడు  ఎప్పుడు  పాలు తాగాలా అని  వారికుంది.దూరం లో దూడ పాపం గుంజకున్న తాడు లాగుతోంది అమ్మ పొదుగు చేరాలని!"తాతా!మాకు రెండు గ్లాసులు  మీఅందరికీ  తలా ఒక గ్లాసు కాఫీ చాలు కదా? పాపం దూడ ఏడుస్తోంది. " తాత నవ్వుతూ అన్నాడు "మరి మనకు పెరుగు మజ్జిగ నెయ్యి  కావాలి కదా?4లీటర్ల పాలు పొద్దుట సాయంత్రం  దూడ తాగితే దానికి జబ్బు చేయదూ?ఒక్క రోజే మీరు కె.జి.అన్నం తినగలరా?""తాతా!ఇప్పుడు దూడ  బలంగా పెరిగితే మంచి ఆవుగా ఎదుగుతుంది కదా? మాకు పెరుగు మజ్జిగ వద్దు. అవి లేకుండా తింటాం.పెరుగు మజ్జిగ ఛ..ఛ..పులుపు!అస్సలు తినబుద్ధి కాదు. ""అరేయ్ పిల్లలూ!మీఅమ్మ చేతివేలిముంచి పాలు తోడేయదు.ఓచెంచా పెరుగు కుమ్మరిస్తుంది.బామ్మ తోడేస్తే కమ్మగా ఉంటుంది. భోజనం ఆఖరున మజ్జిగ అన్నంతినాలి.పాలు ఒక్క రోజు కన్నా  ఉండవు.పైగా రసాయనాలు కల్పి చేస్తున్నారు. పెరుగు చల్ల రెండు రోజులు ఉంటే పులిసిపోతాయి.పెరుగులోంచి వచ్చే వెన్నకూడా రెండు రోజులు మించి ఉండదు మనం ఫ్రిజ్ వాడంకాబట్టి.నెయ్యి బాగా కాస్తే ఓఏడాది దాకా ఉంటుంది. దీపారాధనకి శ్రేష్ఠం.వాతావరణ కాలుష్యం పోగొడ్తుంది.దేని ప్రత్యేకత  గొప్పతనం వాటిదే! ఎవరైనా అంతే!ఎవరి ప్రత్యేకత వారిదే!ఇంకోరితో పోల్చుకుని కించపడటం గొప్పగా ఫీలవటం మంచిది కాదు. చిన్నికృష్ణుడు పిల్లలకు పాలు పెరుగు వెన్న ఎందుకు పంచాడు?పిల్లలు బలంగా ఎదగాలని దృఢంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని!నేటిబాలలే రేపటి పౌరులు!" తాత మాటలతో శివ హరి సంతృప్తి చెందారు 🌹
కామెంట్‌లు