చిత్రకవిత :-@ మీరిరువురే @ కోరాడ నరసింహా రావు
ముదిమిలో  జీవితం, 
    బహు  దుర్భరం !.... ఐనా 
 భర్తకు తోడుగా భార్య... 
    భార్యకు నీడ లా భర్త... 
  ఇరువురూ... ఒకరికొకరు 
      ఆసరాగా బ్రతికే ఉంటే...
        గతానుభవాలు నెమరేసు కుంటూ, కష్టసుఖాలు కలబోసు
కుంటూ... వెతలుమరచి, తమ లాటివారి ఎందరో అనుభవాల కతలువింటూకాలక్షేపంచేసేయవచ్చు!
           ఎవరు, ఎవరో, ఏమిటో
తెలియకపోయినా...., 
 దంపతులుగా ఇరువురు ఒకటై
బరువు, బాధ్యతలు పంచుకుని  ఎన్నో ఆశలతో... పిల్లల్ని కని... 
ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేస్తే
వాళ్ళబ్రతుకుయాతనల్లోవాళ్ళు
ఐనా...నేడు వాళ్ళు చూస్తారను కునే మనంవాళ్ళని కని,పెంచా
మా.... !
 అది మన బాధ్యత ! ఆ పిల్లలు మననిప్రేమతోఆదరిస్తేఅదిమన
అదృష్టం,అది వాళ్లసంస్కారం !
  కని,పెంచి,పెద్దవాళ్ళనుచేసాం 
కనుక ఇప్పుడుమన బరువును  మోయటం వాళ్ళబాధ్యత,మన
కాహక్కుంది....అనుకుంటే,అది పొరపాటే....!!
 భర్తకు భార్యతోడు... 
   భార్యకు భర్తనీడ... 
     సరిగ్గా ఇప్పుడే అవసరం...
యవ్వనంలో కాదు !
 అందుకే... ఓ భార్యా భర్తలారా 
కడదాకా అన్యోన్యంగా కలిసుం 
డండి... !
 అహంకారంతో  భర్త... 
   ఆత్మాభిమానమని భార్య 
    అర్ధంలేని తగవులతో... 
        విడిపోకండి !

జీవితంలో... చుట్టాలూ, బంధు వులూ ఎందరున్నా,కొడుకులూ,కూతు
ళ్లూ ఉన్నా..ఆఖరివరకూ అండ
అండగాతోడుండేది..ఒకరికి ఒక రై, మీరిరువురే... !!
      *******

కామెంట్‌లు