ఆణిముత్యాలు; జగదీశ్ యామిజాల
 పువ్వుని చూడు. తీగను చూడు. వేరు ఎలా ఉంటుందోనని చూడటానికి ప్రయత్నించకు. దానిని చూడటానికి ప్రయత్నిస్తే నువ్వు పువ్వునీ తీగనూ చూడలేవు.
.....
ఏడుస్తున్నప్పుడు ఒంటరిగా ఏడు. నవ్వుతున్నప్పుడు మిత్రులతో కలిసి నవ్వు.
నలుగురిలో ఏడిస్తే నటన అంటారు.
ఒంటరిగా నవ్వితే పిచ్చితనం అంటారు.
......
ఎవరికోసమూ నిన్ను మార్చుకోకు. ఒకవేళ మారాలనుకుంటే ఒక్కొక్కరికోసమూ నువ్వు మారుతుండాలి.
.......
అవసరానికి మించి వస్తువు
సామర్థ్యానికి మించి ఖ్యాతి లభిస్తే
కంటికి కనిపించేవన్నీ 
సాధారణమైనవిగా అన్పిస్తాయి.
 -------
దేనికోసమైనా ఆశ పడుతున్నప్పుడు అది ఇప్పుడు తనతో ఉన్న వ్యక్తి సంతోషంగానే ఉన్నాడా అనేది రూఢీ చేసుకో.
- తమిళకవి కణ్ణదాసన్

కామెంట్‌లు