బొట్టు బొట్టు ఒడిసిపట్టు(చిత్ర కవిత)-- సుమ కైకాల
దీనoగా కనిపించే  ప్రతిబింబాన్ని 
ముద్దాడటం లేదు...
నిలువ నీడ నిచ్చిన భూమాతకి
ప్రణమిల్లడం లేదు...

నిరుద్యోగులకు ఉపాధులoటూ
అక్షరాలలో లిఖించడం...
యువత భవిత బంగారు బాటoటూ 
అరుపులతో నినదించడం...

ఆచరణలో అవగింజంతయినా
అవకాశాలు లేవు...
చదివిన చదువుకి సరిపడే
వృత్తి లేదు...
ఆకలితో అల్లాడే పొట్టకి
తినడానికి తిండీ లేదు...

వృక్ష సంపద నరుకుతూ
ప్రకృతి మాత శాపఫలితంతో
దాహంతో అల్లాడే ప్రాణానికి
తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు...

ఎంతటి హేయమైన పరిస్థితి నాది!
నాకెందుకు ఇంతటి దుర్భరదారిద్య్రo!!

కామెంట్‌లు