కవయిత్రి రూపకు సత్కారం

 బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ శుక్రవారం  (30.9.22) న రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో పాల్గొన్న కవయిత్రి రూప, బతుకమ్మ కవిత చదివి పలువురి ప్రశంశలు అందుకున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ గారి చేతులమీదుగా శాలువాతో సత్కరించబడ్డారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ జూలూరి గౌరీశంకర్ గారు, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు, ఐనంపూడి శ్రీలక్ష్మి గారు  దేవులపల్లి వాణి గారు, కొండపల్లి నిహారిణి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు