బాబులు పాపలు
వీరే కద మనపాలిటి
భావి భాగ్య విధాతలు
ప్రతిబాబు ప్రతిపాప
ఆరోగ్య సుధాబ్ది పట్టిగా
మారితేనే కదా
మనదేశమంతా
ఆరోగ్యజ్యోత్స్నాలంబితమౌతుంది
అప్పుడే కదా
పలుకుల వెలది, గుజ్జు వేలుపు
ఇద్దరూ అనుగ్రహించి
మన బాలల బుద్ధిలో
జ్ఞాన ఝరిని
ప్రవహింపజేస్తారు
అప్పుడే కదా
జ్ఞాన భారతిగా మన దేశం
ప్రపంచానికి
మార్గదర్శి అవుతుంది !!
మార్గదర్శి ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి