టీచర్ కి పిల్లలు కంప్లెయింట్ చేస్తున్నారు "టీచర్!నాబిస్కెట్ పాకెట్ మాయమైంది.నాలంచ్ బాక్స్ లో జాంపండు కనపడటంలేదు. నాకొత్త పెన్సిల్ లేదు. ""సరే!నేను చూస్తా".షార్ట్ ఇంటర్వెల్ లో ఐదోక్లాస్ పిల్లలు పొలోమంటూ బైట కి వెళ్తే టీచర్ దూరంగా క్లాస్ వైపు కన్నేసింది.ఆరోక్లాస్ రాము సోము లోపలికి వచ్చి పిల్లల బ్యాగులు వెతుకుతూ ఉంటే హఠాత్తుగా వచ్చి వారి చేతులు గట్టిగా పట్టుకుంది. అంతే భోరున ఏడుస్తూ ఆతోడుదొంగలు టీచర్ కాళ్ళ వేళ్ళ పడ్డారు. బెల్ కాగానే ఆరోక్లాస్ కి వెళ్లిన టీచర్ వారిని ఏమీఅనలేదు.ఎందుకంటే పిల్లలను నలుగురిలో అవమానం చేయటం భావ్యంకాదు.ఎవరినీ హర్ట్ చేయరాదు.మరీ ఆత్మీయులైతే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి.
ఓకథచెప్పారామె" ఓమ్యావ్ మ్యావ్ పిల్లికి చాలా గర్వం!పులికి మేనమామను అని మీసాలు దువ్వేది.ఆఇంట్లో దూరి పాలు పెరుగు శుభ్రంగా తాగేది.ఆఇల్లాలు వేడివేడి పాలు పెట్టింది కావాలనే! రోజూ చల్లగా ఉంటాయి. ఠక్కున మూతిపెట్టిన పిల్లి నోరు కాలటం గిన్నె కిందకి దొర్లి పాలలో కాళ్ళు చర్ర్ న కాలటం లబోదిబో అని ఓమూల నక్కింది.రెండు రోజులు గడిచినా దాని నోరు మండుతోంది. కడుపులో ఆకలి నకనక!ఎదురుగా ఎలుకలు దాన్ని చూసి పకపకా నవ్వుతూ"కుదిరిందా తిక్క!పిల్లి మామా!" అని బనాయిస్తుంటే బాధతో ఏడ్చింది. ఇంతలో జాలితో ఓ పందికొక్కు దాని దగ్గరికి వచ్చి ఆఇంటి వారు వాడే ఆయింట్ మెంట్ తెచ్చి దాన్ని తన తోకతో పిల్లి మూతి అంతా పూసింది.అంతే ఆసాయంత్రంకల్లా దాని నోరు బాగైంది.అంతే!మళ్ళీ దొంగతనం గా పాలు పెరుగు తాగలేదు.బైట పడేసిన అన్నంమెతుకులు చిన్న నోటి కి చిక్కిన ప్రాణులని తినసాగింది."టీచర్ చెప్పిన కథవిని రాము సోము సిగ్గు పడ్డారు 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి