- * తన్మయం *(చిత్రకవిత :)- కోరాడ నరసింహా రావు !
నిశ్చితార్ధమున తొడిగిన ..., వరుని అంగుళీకమును,
పరవశమున జూచుచూ ..., ముదితమోమున, విరిసె... ఆనంద చంద్రికలు... !

పులకరింతల మేనిసౌందర్యమే 
 మెరిసె  ద్విగుణీకృతముగా.. !

కోటి ఊహల..... 
         చెలికాని దలచుచు... 
హృదయమానంద డోలికల.. 
     ఓల లాడి .... తీపి తలపుల
 తాను తన్మయమునొందె... !
      ******

కామెంట్‌లు